Dairy Farm Loans: డిమాండ్ కు అనుగుణంగా వ్యాపారం చేస్తే వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశాలు పెరగడంతో పాటు నష్టాలు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. లాభసాటి వ్యవసాయ వ్యాపారాలలో పశువుల పెంపకం ఒకటి కాగా పశువుల పెంపకం ద్వారా నష్టాలు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పశుసంవర్ధక, పాడి పరిశ్రమను ప్రోత్సహించే దిశగా అడుగులు వేస్తుండటం గమనార్హం. రైతుల అవసరాలకు అనుగుణంగా రుణాలను పొందవచ్చు.
పాల వ్యవస్థాపక అభివృద్ధి పేరుతో కేంద్రం ఈ స్కీమ్ ను అమలు చేస్తోంది. పది గేదెలను కలిగి ఉన్న పాడిపరిశ్రమను మొదలు పెట్టడం కొరకు రైతులు 7 లక్షల రూపాయల వరకు లోన్ పొందే అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్ కింద లోన్ తీసుకునే మహిళలు 33 శాతం సబ్సిడీ పొందవచ్చు. ఎస్సీ కేటగిరీ మహిళలైట్ కింద మరింత రాయితీని పొందే అవకాశాలు అయితే ఉంటాయని తెలుస్తోంది. జనరల్ కేటగిరీ డెయిరీ యజమానికి 25 శాతం, మహిళలకు, ఎస్సీ తరగతికి 33 శాతం సబ్సిడీ పొందే అవకాశం ఉంటుంది.
నాబార్డ్ సంస్థ పాడి వ్యవస్థాపకులకు ప్రయోజనం చేకూర్చేలా చేయాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ ను అమలు చేస్తుండటం గమనార్హం. 2010 సెప్టెంబర్ 1 నుండి ఈ స్కీమ్ అమలులో ఉంది. పశువుల పెంపకంపై ఆసక్తి ఉన్నవాళ్లు 10 శాతం సొంతంగా పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. లక్ష కంటే ఎక్కువ రుణం కావాలంటే ఆస్తి పత్రాలను షూరిటీగా పెట్టాలి.
రాయితీ కింద ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకునే వాళ్లు కాస్ట్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, ప్రాజెక్ట్ కు సంబందించిన వివరాలతో కూడిన పాత్రలను జత చేయాల్సి ఉంటుంది. సమీపంలోని బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించి ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.