Golda Rates Today :గుడ్ న్యూస్ చెప్పిన బంగారం ధరలు..

అంతర్జాతీయం బంగారం ధరలు స్వల్పంగాపెరిగి స్పాట్ గోల్డ్ ఔన్స్ కు 2036 డాలర్లుగా నమోదైంది. సిల్వర్ ఔన్స్ కు 22.96 డాలర్ల ట్రేడ్ అవుతోంది.

Written By: Srinivas, Updated On : February 24, 2024 8:25 am

gold rates Today

Follow us on

Gold Price Today: శుభకార్యాలు జరుగుతున్న వేళ బంగారం ధరలు గుడ్ న్యూస్ చెప్పాయి. కొన్ని రోజులుగా పెరుగుతూ తగ్గిన బంగారం ధరలు శనివారం స్థిరంగా కొనసాగాయి. అయితే అంతర్జాతీయం బంగారం ధరలు స్వల్పంగాపెరిగి స్పాట్ గోల్డ్ ఔన్స్ కు 2036 డాలర్లుగా నమోదైంది. సిల్వర్ ఔన్స్ కు 22.96 డాలర్ల ట్రేడ్ అవుతోంది. 2024 ఫిబ్రవరి 24వ తేదీన ధరలు ఎలా ఉన్నాయంటే?

బులియన్ మార్కెట్ ప్రకారం.. ఫిబ్రవరి 24న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,500గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.62,730 గా ఉంది. ఫిబ్రవరి 22న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,500తో విక్రయించారు. 10 గ్రాముల బంగారానికి శుక్రవారం కంటే శనివారం ధరల్లో ఎటువంటి మార్పులు లేవు. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,640 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.62,870గా నమోదైంది.ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,500 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.62,730 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.57,990 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.63,220తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.57,500 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.62,730తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.57,500తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.62,730తో విక్రయిస్తున్నారు.

బంగారం ధరలు స్థిరంగా ఉన్నా వెండి ధరలు తగ్గిపోయాయి.శనివారం ఓవరాల్ గా కిలో వెండి రూ.74,400గా నమోదైంది. శుక్రవారంతో పోలిస్తే శనివారం వెండి ధరలు రూ.100 తగ్గింది. న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.74,400గా ఉంది. ముంబైలో రూ..74,400, చెన్నైలో రూ.75,900, బెంగుళూరులో 72,600, హైదరాబాద్ లో రూ.75,900తో విక్రయిస్తున్నారు.