Gold Price Today: బంగారం ధరలు భారీ షాక్ ఇస్తూనే ఉన్నాయి. తాజాగా మరో రూ.1000 పెరిగింది. కొన్నిరోజులుగా బంగారం ధరలు వరుసగా పెరగడంపై కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులు , సిరియాలోని రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడికి ప్రతీకారంగా ఎప్పుడైనా ఇరాన్ దాడి చేయొచ్చనే భయాలు ఎక్కువయ్యాయి. వీటితో పాటు ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గింపు ప్రకటన చేశారు. ఈ సంవత్సరం 3 సార్లు వడ్డీ రేట్లు తగ్గిస్తామని స్పష్టం చేశారు. దీంతో డాలర్, బాండ్ ఈల్డ్స్ విలువ పడిపోతూ బంగారం ధర పెరుగుతోంది. దేశీయంగా నేడు బంగారం ధరలు ఉన్నాయో చూద్దాం..
బులియన్ మార్కెట్ ప్రకారం.. ఏప్రిల్ 13న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,200గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.73,320 గా ఉంది. ఏప్రిల్ 12న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.66,200తో విక్రయించారు. 10 గ్రాముల బంగారానికి శుక్రవారంతో పోలిస్తే శనివారం రూ.1000 పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,360 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.73,470 గా నమోదైంది.ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.67,200 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.73,320 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.68,060 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.74,270తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.67,200 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.73,320తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.67,200తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.73,320తో విక్రయిస్తున్నారు.
బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరిగాయి. శనివారం ఓవరాల్ గా కిలో వెండి రూ.86,600గా నమోదైంది. న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.86,600గా ఉంది. ముంబైలో రూ.86,600, చెన్నైలో రూ.90,100, బెంగుళూరులో 84,150, హైదరాబాద్ లో రూ.90,100తో విక్రయిస్తున్నారు.