Gold Rates Today: బంగారం కంటే వేగంగా పెరుగుతున్న వెండి..ఒక్కరోజులోనే రూ.4000 అప్..

బులియన్ మార్కెట్ ప్రకారం.. మే19న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,400గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.74,620 గా ఉంది. మే 18న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ..67,600తో విక్రయించారు. 10 గ్రాముల బంగారానికి శనివారంతో పోలిస్తే ఆదివారం రూ.800 పెరిగింది.

Written By: Chai Muchhata, Updated On : May 19, 2024 6:12 am

Gold Purchase

Follow us on

Gold Price Today: బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. కాస్త తగ్గుతూ ఊహించనంత స్థాయిలో బంగారం పెరుగుతోంది. అయితే బంగారం కంటే వేగంగా వెండి ఎగబాకుతోంది. ఒక్కరోజులోనే రూ.4000 పెరిగి వినియోగదారులకు షాక్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో దేశీయంగా బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

బులియన్ మార్కెట్ ప్రకారం.. మే19న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,400గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.74,620 గా ఉంది. మే 18న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ..67,600తో విక్రయించారు. 10 గ్రాముల బంగారానికి శనివారంతో పోలిస్తే ఆదివారం రూ.800 పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,550 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.74,770గా నమోదైంది.ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.68,400 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.74,620 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.68,500 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.74,730తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.68,400 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.74,620తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.68,400తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.74,620తో విక్రయిస్తున్నారు.

బంగారంతో పాటు వెండి ధరలు తగ్గాయి. ఆదివారం ఓవరాల్ గా కిలో వెండి రూ.93,000గా నమోదైంది. శనివారంతో పోలిస్తే ఆదివారం రూ.4000 పెరగడం విశేషం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.93,000గా ఉంది. ముంబైలో రూ.93,000, చెన్నైలో రూ.96,500, బెంగుళూరులో 89,000, హైదరాబాద్ లో రూ.96,500తో విక్రయిస్తున్నారు.