Gold Rates Today: మహిళలకు గుడ్ న్యూస్.. ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Price Today: బంగారం కొనాలనుకునే మహిళలకు గుడ్ న్యూస్. రెండు రోజులుగా పెరిగిన బంగారం ధరలు ఈరోజు స్థిరంగా కొనసాగాయి. వెండి మాత్రం రూ.600 తగ్గింది. అంతర్జాతీయంగా బంగారం ధరలు చూస్తే.. స్పాట్ గోల్డ్ ఔన్స్ కు 2,305 డాలర్లుగా నమోదైంది. సిల్వర్ ఔన్స్ కు 29.04 డాలర్లు పలికింది. దేశీయంగా శుక్రవారం  బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

Written By: Chai Muchhata, Updated On : June 14, 2024 7:51 am

gold price today

Follow us on

Gold Price Today: బంగారం కొనాలనుకునే మహిళలకు గుడ్ న్యూస్. రెండు రోజులుగా పెరిగిన బంగారం ధరలు ఈరోజు స్థిరంగా కొనసాగాయి. వెండి మాత్రం రూ.600 తగ్గింది. అంతర్జాతీయంగా బంగారం ధరలు చూస్తే.. స్పాట్ గోల్డ్ ఔన్స్ కు 2,305 డాలర్లుగా నమోదైంది. సిల్వర్ ఔన్స్ కు 29.04 డాలర్లు పలికింది. దేశీయంగా శుక్రవారం  బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

బులియన్ మార్కెట్ ప్రకారం.. జూన్ 14న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,150గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.72,160 గా ఉంది. జూన్ 13న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.66,150తో విక్రయించారు. 10 గ్రాముల బంగారం ధర గురువారంతో పోలిస్తే శుక్రవారం ఎలాంటి మార్పులు లేకుండా స్థిరంగా కొనసాగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,240 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.72,300గా నమోదైంది.ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.66,150 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.72,150 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.66,810 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.72,880తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.65,650 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.72,170తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.65,650తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.72,170తో విక్రయిస్తున్నారు.

బంగారం ధరలు స్థిరంగా ఉన్నా.. వెండి ధరలు తగ్గాయి. శుక్రవారం ఓవరాల్ గా కిలో వెండి రూ.95,200గా నమోదైంది. గురువారంతో పోలిస్తే శుక్రవారం రూ.600 తగ్గింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.90,600గా ఉంది. ముంబైలో రూ.90,600, చెన్నైలో రూ.95,100 బెంగుళూరులో 90,400, హైదరాబాద్ లో రూ. 95,200 తో విక్రయిస్తున్నారు.