Gold Prices: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఈరోజు ఎలా ఉన్నాయో తెలుసా?

బులియన్ మార్కెట్ ప్రకారం.. డిసెంబర్ 2న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,700గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.62,950 గా ఉంది. డిసెంబర్ 1న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,500తో విక్రయించారు.

Written By: Chai Muchhata, Updated On : December 2, 2023 8:08 am

Gold Prices

Follow us on

Gold Prices: బంగారం, వెండి కొనాలనుకునేవారికి మరోసారి షాకింగ్ న్యూస్. నిన్న తగ్గిన బంగారం ధరలు మరోసారి పెరిగాయి. వెండి ధరలు కూడా పెరగడం గమనార్హం.

బులియన్ మార్కెట్ ప్రకారం.. డిసెంబర్ 2న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,700గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.62,950 గా ఉంది. డిసెంబర్ 1న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,500తో విక్రయించారు. శుక్రవారం కంటే శనివారం బంగారం ధరలు రూ.200 మేర పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,850 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.63,100గా నమోదైంది. ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,700 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.62,950 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.58,500 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.63,820తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.57,700 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.62,950తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.57,700తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.62,950తో విక్రయిస్తున్నారు.

బంగారం ధరలతో పాటు వెండి ధరలు పెరిగాయి. శనివారం ఓవరాల్ గా కిలో వెండి రూ.79,500గా నమోదైంది. శుక్రవారంతో పోలిస్తే శనివారం వెండి ధరలు రూ.300 పెరిగింది. న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.79,500గా ఉంది. ముంబైలో రూ.79,500, చెన్నైలో రూ.82,500, బెంగుళూరులో 79,000, హైదరాబాద్ లో రూ.82,500తో విక్రయిస్తున్నారు.