Gold Price in India (28th August 2021): ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో బంగారం వినియోగం ఎక్కువనే సంగతి తెలిసిందే. అయితే రోజురోజుకు పెరుగుతున్న బంగారం ధరల వల్ల సామాన్యులు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. శనివారం రోజున బంగారం ధరలు మరోసారి పెరిగాయి. మన దేశంలోని మహిళలు బంగారం కొనుగోలుపై ఎక్కువగా ఆసక్తి చూపుతారు. ధరలు పెరిగినా బంగారం కొనుగోలు విషయంలో వెనుకడుగు వేయడానికి ఇష్టపడరు.
ప్రస్తుతం 10 గ్రాముల బంగారంపై ధరలు ఏకంగా 400 రూపాయల వరకు పెరిగాయి. ప్రస్తుతం ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 50,780 రూపాయలుగా ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 46,550 రూపాయలుగా ఉంది. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 44,400 రూపాయలుగా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 48,400 రూపాయలుగా ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 44,400 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 48,400 రూపాయలుగా ఉంది. విశాఖలో కూడా ప్రస్తుతం ఇవే ధరలు అమలులో ఉన్నాయి. బులియన్ మార్కెట్ నిపుణులు బంగారం ధరలపై వేర్వేరు అంశాలు ప్రభావం చూపుతాయని వెల్లడిస్తున్నారు. జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, కరోనా, ఇతర అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.
ధరలు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో బంగారం కొనుగోలు చేసేవాళ్లు ఇప్పుడే కొనుగోలు చేస్తే మంచిది. రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం.