Gold Price Today: ఇంతింతై.. వటుడింతై.. అన్నట్లుగా బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. మొన్నటి వరకు లక్ష వరకు మాత్రమే ఉన్న బంగారం ధరలు ఇప్పుడు అంతకు మించి అన్నట్లుగా పెరిగిపోతున్నాయి. తాజాగా రూ.1,10,000 దాటడం విశేషం. దీంతో బంగారం చరిత్రలోనే ఇది తొలిసారి అని వర్తకులు అంటున్నారు. పండుగల సీజన్ ప్రారంభమైన సందర్భంగా బంగారం కొనుగోళ్లు పెరిగాయి. అంతేకాకుండా అంతర్జాతీయంగా ఏర్పడిన పరిస్థితుల కారణంగా బంగారంపై పెట్టుబడులు పెరిగాయి. దీంతో బంగారం ధరలు పెరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
బులియన్ మార్కెట్ ప్రకారం సెప్టెంబర్ 9 ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారానికి రూ.1,01,100 నమోదైంది. 24 క్యారెట్ల బంగారం కొనాలంటే రూ.1,10,290 చెల్లించాలి. న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,01,250 కాగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,10,440గా నమోదైంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,01,100 కాగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,10,290గా నమోదైంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,01,500 కాగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,10,730గా నమోదైంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,01,100 కాగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,10,290గా నమోదైంది. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,01,100కాగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,10,290గా నమోదైంది.
Also Read: ఏఐ, ఆటోమేషన్‌లో జనరేషన్ Z కనుమరుగు
వెండి ధరలు సైతం పెరుగుతున్నాయి. కిలో వెండి ధర రూ.1,40,000గా ఉంది. వరల్డ్ వైడ్ గా ఉన్న ఫైనాన్స్ సమస్యల కారణంగా పెట్టుబడిదాలులు బంగారం కొనుగోళ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఎక్కువ శాతం మంది బంగారం కొనుగోళ్లు చేస్తున్నారు. ప్రస్తుతం బంగారం సురక్షితమైన ఆస్తిగా పరిగణించబడుతోంది. అందుకే దీనికి డిమాండ్ ఎక్కువగా ఉంటోందని ఆర్థిక నిపుణులు తెలుపుతున్నారు.
మరోవైపు ఆస్టు నెలలో బంగారం ధరలు విపరీతంగా పెరిగాయి. ఆగస్టు 20న 22 క్యారెట్ల బంగారం ధర రూ.91,800 ఉండగా.. ప్రస్తతం రూ.1.01,100కు చేరింది. ఒక్క నెలలోనే 10వేలు పెరగడం విశేషం. వెండి సైతం నెల రోజుల్లో అంతేస్థాయిలో పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో మంచిరోజలు రాబోతుండడంతో బంగారం కొనుగోళ్లపై ఆందోళన వాతావరణం నెలకొంది. దీంతో రానున్న రోజుల్లో బంగారం కొనుగోళ్లు ఎలా ఉంటాయో చూడాలి.