Gold, Silver Prices: బంగారం ప్రియులకు శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు.. కానీ?

Gold, Silver Prices: మన దేశంలోని మహిళలు బంగారాన్ని ఎంతగానో ఇష్టపడతారనే సంగతి తెలిసిందే. శుభకార్యాలు జరిగిన సమయంలో, పండుగల సమయంలో బంగారాన్ని కొనుగోలు చేయడానికి మన దేశ ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతారు. అయితే గత కొన్నిరోజులుగా బంగారం ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొని ఉండటంతో బంగారం ధరలు అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. అయితే ఈరోజు బంగారం ధరలు భారీగా తగ్గడం గమనార్హం. మన దేశంలోని ప్రధాన […]

Written By: Navya, Updated On : March 5, 2022 9:18 am
Follow us on

Gold, Silver Prices: మన దేశంలోని మహిళలు బంగారాన్ని ఎంతగానో ఇష్టపడతారనే సంగతి తెలిసిందే. శుభకార్యాలు జరిగిన సమయంలో, పండుగల సమయంలో బంగారాన్ని కొనుగోలు చేయడానికి మన దేశ ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతారు. అయితే గత కొన్నిరోజులుగా బంగారం ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొని ఉండటంతో బంగారం ధరలు అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

అయితే ఈరోజు బంగారం ధరలు భారీగా తగ్గడం గమనార్హం. మన దేశంలోని ప్రధాన నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర 47,300 రూపాయలుగా నిన్నటి ధరలతో పోల్చితే 10 గ్రాముల బంగారంపై ఏకంగా 400 రూపాయలు ధర తగ్గింది. అదే సమయంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలను పరిశీలిస్తే 51,600 రూపాయలుగా ఉంది. నిన్నటి ధరతో పోల్చి చూస్తే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 440 రూపాయలు తగ్గింది.

హైదరాబాద్, బెంగళూరు, న్యూఢిల్లీ, కోల్ కతా నగరాల్లో ఈ ధరలు అమలవుతున్నాయి. ప్రాంతాలను బట్టి బంగారం ధరలలో స్వల్పంగా మార్పులు ఉండే అవకాశం ఉంటుంది. ఫిబ్రవరి నెలతో పోల్చి చూస్తే బంగారం ధర ఊహించని స్థాయిలో పెరిగింది. నెలరోజుల్లోనే బంగారం ధరలు పెరగగా రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.

బంగారం ధరలపై వేర్వేరు అంశాలు ప్రభావం చూపుతాయనే సంగతి తెలిసిందే. బంగారం ధరలు తగ్గితే వెండి ధరలు మాత్రం స్వల్పంగా పెరగడం గమనార్హం. దేశంలోని ప్రధాన నగరాల్లో కిలో వెండి ధర 67,300 రూపాయలుగా ఉంది. నిన్నటి ధరలతో పోల్చి చూస్తే వెండి ధర 100 రూపాయలు పెరిగింది. ముంబై, ఢిల్లీ, కోల్ కతా నగరాల్లో ఈ ధర ఉండగా హైదరాబాద్ లో మాత్రం కిలో వెండి 72,500 రూపాయలుగా ఉండటం గమనార్హం.