Anant Ambani Wedding: కరీంనగర్ పేరు ఇప్పు మరో సారి దేశ వ్యాప్తంగా వినిపిస్తుంది. ప్రపంచ కుభేరుడు ముఖేష్ అంబానీ ఇంట్లో వివాహ వేడుకకు సంబంధించి మరోసారి వార్తల్లోకి ఎక్కింది. జూలై, 2024లో అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహం జరగబోతోంది. ఈ వివాహానికి హాజరయ్యే గ్లోబల్ ఏ-లిస్టర్లకు అంబానీలు బహుమతి (రిటన్ గిఫ్ట్స్) ఇవ్వాలని అనుకుంటున్నారు. ఈ రిటర్న్ గిఫ్ట్ జాబితాలో కరీంనగర్ చెందిన సిల్వర్ ఫిలిగ్రీ కళాఖండాలు కూడా ఉన్నాయి.
ఈ ఏడాది (2024) మార్చిలో జామ్ నగర్ లో జరిగిన ప్రీ వెడ్డింగ్ వేడుకలకు బిల్ గేట్స్, మార్క్ జుకర్ బర్గ్, హిల్లరీ క్లింటన్, రిహానా వంటి ప్రముఖులు హాజరయ్యారు. కరీంనగర్ హ్యాండీక్రాఫ్ట్స్ వెల్ఫేర్ సొసైటీ (సిఫ్కా) సిల్వర్ ఫిలిగ్రీ ఈ వివాహానికి ఆభరణాల పెట్టెలు, పర్సులు, ట్రేలు, పండ్ల గిన్నెలు సహా సుమారు 400 రకాలు అధిక విలువ గల కళాఖండాల కోసం ఆర్డర్ పొందినట్లు సిఫ్కా అధ్యక్షుడు అర్రోజు అశోక్ తెలిపారు. సుమారు 400 సంవత్సరాల నాటి ఈ పురాతన వస్తువులతో అంబానీ వివాహాన్ని నిర్వహించడం పెద్ద ఎండార్స్మెంట్ బూస్ట్ అవుతుందని, వారి సృష్టి ప్రపంచ వ్యాప్తంగా ధనవంతులు, ప్రసిద్ధుల ఇళ్లకు చేరుతుందని అశోక్ ఆనందం వ్యక్తం చేశారు. 2023 నవంబర్ లో హైదరాబాద్ తో అరంగేట్రం చేసిన రిలయన్స్ రిటైల్ స్వదేశ్ స్టోర్ కు సిఫ్కా వీటినీ సరఫరా చేస్తోందని ఆయన తెలిపారు.
ముంబైలోని నీతా అంబానీ కల్చరల్ సెంటర్ లో ప్రదర్శన అనంతరం రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్ పర్సన్ నీతా అంబానీ వీటిని గుర్తించారని జాతీయ, అంతర్జాతీయ అవార్డులు పొందిన అశోక్ చెప్పారు. తరతరాలుగా వస్తున్న ఈ పురాతన హస్తకళను నమ్ముకొని కరీంనగర్ లో దాదాపు 150 కుటుంబాలకు చెందిన 300 మంది కళాకారులు పని చేస్తున్నారని వారంతా 2007లో జీఐ ట్యాగ్ పొందారని అశోక్ తెలిపారు.
జీఐ ట్యాగ్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు ఈ క్రాఫ్ట్ టర్నోవర్ కేవలం 2 కోట్లు మాత్రమే ఉండేది. అప్పటి నుంచి ఇది పెరుగుతూ దాదాపు 5 రెట్లకు చేరింది. కానీ దాని సామర్థ్యం ఇప్పటికీ చాలా వరకు ఉపయోగించబడలేదు. కరీంనగర్ కు చెందిన కళాకారులు అల్లిన ఈ మెటల్ మ్యాజిక్ కు ఇలాంటి గ్లోబల్ ఎక్స్ పోజర్ కొత్త మార్గాలను సృష్టించగలదు.’ అని 2006లో ఈజీఐ నమోదుకు సహకరించిన జీఐ ఏజెంట్ సుభాజిత్ సాహా చెప్పారు.
మెటల్ క్రాఫ్ట్ లో సన్నని వెండి తీగలను కత్తిరించడం, మెలితిప్పడం, వెండి రేకులపై సంక్లిష్టమైనవి చెక్కడం వంటి తీగలు ఉంటాయి. మీనాకారి పని, ఖుల్లా జాల్ పని, పువ్వు, ఆకుల ఆకృతులను కలిగి ఉంటాయి. ఒడిశాలోని కటక్ కూడా జీఐ-ట్యాగ్ చేయబడిన సిల్వర్ ఫిలిగ్రీ పనులకు కేంద్రంగా ఉంది. అయితే ఇది పూర్తిగా చేతితో తయారు చేయబడింది. 92 శాతం కంటే ఎక్కువ స్వచ్ఛమైన వెండిని ఇందులో ఉపయోగిస్తారు.