Food Startups and Trends:అమెరికాలో పిజ్జాలు ఎక్కువగా తింటారు. బర్గర్లు లొట్టలు వేసుకుంటూ ఆరగిస్తారు.. ఇంగ్లాండ్ దేశంలో పాస్తాను బీభత్సంగా కుమ్మేస్తారు. మెక్సికోలో టాంగోను ప్లేట్లకు ప్లేట్లు లాగిస్తుంటారు. ఇలా ఏ దేశానికి వెళ్లినా అక్కడి ప్రజలకు ఏదో ఒక సిగ్నేచర్ డిష్ ఉంటుంది. ఎంత తిన్నా అక్కడి ప్రజలకు జిహ్వచాపల్యం తగ్గదు. పైగా ఆ తిండి కోసం వారు ఎంతైనా ఖర్చు పెడతారు. ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనుకాడరు. విదేశీయుల గురించి చెబుతున్నారు.. మరి మన వాళ్ళ సంగతి ఏంటి.. అనే సందేహం మీకు వచ్చింది కదా..
మనవాళ్లు పిజ్జాలు తింటారు, బర్గర్లు ఆరగిస్తారు, పాస్తాలను కూడా లొట్టలు వేసుకొని బొజ్జల్లోకి పంపిస్తారు. ఈ మూడింటికంటే మన దేశస్థులకు సమోసా అంటే చాలా ఇష్టం. అప్పట్లో సమోసాలో ఆలూ ఉన్నంతవరకు బీహార్ లో లాలూ ఉంటాడని లాలూ ప్రసాద్ యాదవ్ చెప్పినట్టు.. ఈ భూమి మీద తాము ఉన్నంతవరకు సమోసాలు తింటూనే ఉంటారని ఇండియన్స్ నిరూపిస్తున్నారు. ఎవరైనా తింటే మహా అయితే ఓ వందల కోట్లల్లో వాటి అమ్మకాలు సాగుతుంటాయి. కానీ మన దేశంలో ప్రతి ఏడాది 21,900 కోట్ల విలువైన సమోసాలను విక్రయిస్తున్నారు. ఈ డబ్బులు బంగ్లాదేశ్ డిఫెన్స్ బడ్జెట్లో సగం అంటే మన వాళ్లకు సమోసాలు అంటే ఎంత పిచ్చో అర్థం చేసుకోవచ్చు.
Also Read: నీకు డబ్బు కావాలంటే ‘పవన్’ చెప్పిన ఈ పాఠం వినాలి
మారిన అభిరుచి ఆధారంగానే సమోసాలు కూడా కొత్త రూపు సంతరించుకున్నాయి. గతంలో ఆలూ సమోసాలు మాత్రమే అందుబాటులో ఉండేవి. ఇప్పుడు రకరకాల సమోసాలు తెరపైకి వచ్చాయి. ఆలు, చీజ్, బట్టర్, పన్నీర్, చికెన్, ఆనియన్, మటన్ వంటి సమోసాలు భారతీయుల జిహ్వ చేపల్యాన్ని తీర్చుతున్నాయి.. సమోసా వ్యాపారం ఈ స్థాయిలో ఉండడంతో కార్పొరేట్ కంపెనీలు కూడా ఈ రంగాల్లోకి వస్తున్నాయి. ఐఐటీలలో చదివిన వారు కూడా సమోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. సమోసా కేంద్రాలను ఏకంగా స్టార్టప్ కంపెనీలుగా ఏర్పాటు చేస్తుండడం విశేషం. సమోసాలలో అధిక కేలరీలు ఉన్నాయని.. వీటిని అధికంగా తీసుకుంటే రకరకాల వ్యాధులు వస్తాయని వైద్యులు చెబుతున్నప్పటికీ.. భారతీయులు వాటిని తినడం మానడం లేదు. పైగా ప్రతిరోజు సాయంత్రం చిరుతిండిగా సమోసాలను లాగించేస్తున్నారు. బొజ్జ నిండా తింటూ.. జిహ్వ చేపల్యాన్ని తీర్చుకుంటున్నారు.
ఏకంగా 21,900 కోట్ల సమోసాలు ఎలా విక్రయిస్తున్నారు? ఇన్ని కోట్ల సమోసాలు విక్రయమవుతున్నాయని ఎవరు చెప్పారు? అనే ప్రశ్నలు మీకు రావచ్చు. ఓ సంస్థ కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించింది. ఆ సర్వే ప్రకారమే ఈ వివరాలను వెల్లడించింది. ఈ సర్వేలో కేవలం ఆ తినుబండారం విక్రయాలు మాత్రమే కాదు, ఎందుకు అంత రుచికరంగా ఉంటున్నాయి? భారతీయులు ఎందుకు అంతలా తింటున్నారు? అనే విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. మొత్తంగా ఈ సర్వే ద్వారా భారతీయులతో సమోసా ఎంతటి అవినాభావ సంబంధం ఏర్పరుచుకుందో బయటికి తెలియ వచ్చింది.