Business Tips: ఏ బిజినెస్ లోనైనా డబ్బు సంపాదించాలంటే కొత్త కస్టమర్లను (వీరిని లీడ్స్ అంటారు) ఆకర్షించడం చాలా ముఖ్యం. మన బిజినెస్‌లో లాభాలు సంపాదించడంలో వీరు అత్యంత కీలక పాత్ర పోషిస్తారు. మన దేశంలో దాదాపు 79శాతం చిన్న వ్యాపారాలు కొత్త కస్టమర్లు లేకపోవడం వల్లే నష్టపోతున్నాయని హబ్ స్పాట్ ఇండియా నివేదికలో తేటతెల్లమైంది. మరి, సోషల్ మీడియా, డిజిటల్ ప్రచారం రోజురోజుకు జోరందుకుంటున్నప్పటికీ, అనేక బిజినెస్ లలో లీడ్స్ ఎందుకు పెరగట్లేదు? ఇప్పుడున్న అవకాశాలను ఉపయోగించుకొని వ్యాపారంలో లాభాలు ఎలా పొందాలో ఈ వార్తలో తెలుసుకుందాం.
పాత కస్టమర్లతో తిరిగి కనెక్ట్ అవ్వండి
చీకట్లో ఉన్నప్పుడు కాంతి ఎంత ముఖ్యమో, అలాగే మీ ఉత్పత్తుల పట్ల గతంలో ఆసక్తి చూపిన కస్టమర్లతో తిరిగి కనెక్ట్ అవ్వడం కూడా చాలా ముఖ్యం. మీ ఉత్పత్తులు కొనని వారితో కూడా ఒకసారి టచ్‌లోకి వెళ్లండి. వారి కోసం స్పెషల్ ఆఫర్లు ప్రకటించండి. వాళ్లను తిరిగి మీతో ఎంగేజ్ అయ్యేలా చేయండి.
Also Read: Harsha Goenka : 9-5 జాబ్.. హర్ష్ గొయెంకా చెప్పిన ఓ ‘ఉద్యోగ పాఠం’
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండండి
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండండి. మీ పోస్టులకు లైక్స్, కామెంట్స్ చేసేవారిని గుర్తిస్తూ ఉండండి. వారికి వ్యక్తిగతంగా మెసేజ్ చేసి, ఆఫర్‌లు ఇవ్వండి. సోషల్ మీడియాలో మీ ఉనికిని చాటుకోవడమే కాదు, మీతో ఇంటరాక్ట్ అయ్యే వారితో వ్యక్తిగత సంబంధాలు ఏర్పరచుకోవడం కూడా లీడ్స్ పొందడంలో కీలకం.
Also Read: తరచుగా రాష్ట్రాలు మారుతున్నారా? అయితే మీ కారుకు BH సిరీస్ నంబర్ ప్లేట్ తప్పనిసరి!
వాట్సాప్ బ్రాడ్‌కాస్ట్ గ్రూప్ క్రియేట్ చేయండి
మీ వద్ద ఉన్న పాత కస్టమర్ల ఫోన్ నంబర్లను (పుస్తకాల్లో రాసుకున్నవి అయినా పర్వాలేదు) ఉపయోగించి ఒక వాట్సాప్ బ్రాడ్‌కాస్ట్ గ్రూప్ క్రియేట్ చేయండి. వారికి ఎమర్జెన్సీ ఆఫర్‌లు, డిస్కౌంట్లు, గిఫ్ట్ వివరాలను పంపండి. అయితే, మీ నంబర్‌ను ఎవరైతే వాళ్ల ఫోన్‌లో సేవ్ చేసుకున్న వారికి మాత్రమే ఈ మెసేజ్ లు వెళ్తాయి అన్న విషయం మాత్రం మర్చిపోకండి. కాబట్టి, మీ కస్టమర్లను మీ నంబర్‌ను సేవ్ చేసుకోమని ఓ సారి సూచించండి.