Soap price : ఉదయం లేవగానే మనం బ్రెష్ చేసుకుంటాం. అంటే పేస్టు ఉండాల్సిందే. ఇక తర్వాత స్నానం.. షాపు, సోపు ఉండాలి. తర్వాత టీ, టిఫిన్.. ఇలా అన్నీ మనకు నిత్యావసరాలే. వాటిని బ్బులు పెట్టి కొనుగోలు చేయాల్సిందే. అయితే ఒకప్పుడు తక్కువ ధరలు ఉన్న చాలా వస్తువులు ఇప్పుడు సామాన్యులు కొనలేనంతరగా ఖరీదయ్యాయి. ఇక కూరగాయల ధరలు అయితే.. పెరుగుతూ పోతూనే ఉన్నాయి. ఉప్పులు, పప్పుల ధరలు సామాన్యులకు ఎప్పుడో అందనంత పెరిగాయి. పేదల పరిస్థితి పచ్చడ మెతుకులే అన్నట్లుగా తయారైంది. అయినా కొనక తప్పని పరిస్థితి. తాజాగా సబ్బుల ధరలను కూడా కంపెనీలు పెంచాయి. దీంతో ఇప్పుడు పేదలే కాదు సామాన్యులు కూడా సబ్బుతో స్నానం చేయం కష్టంగా మారే పరిస్థితి.
అన్ని కంపెనీల ధరలు పెంపు..
ఎఫ్‌ఎంసీజీ రంగంలో ఉన్న హె చ్‌ఐయూఎల్, విప్రో వంటి ప్రముఖ సంస్థలన్నీ సబ్బుల ధరలు పెంచాయి. 7 నుంచి 8 శాతం వరకు ధరలు పెంచుతున్నట్లు ప్రకటించాయి. సబ్బుల తయారీకి కీలక ముడి సరుకు అయినా పామాయిల్ ధరల పెరుగుదల కారణంగా సబ్బుల ధరలు పెంచాల్సి వచ్చిందని కంపెనీలు వెల్లడించాయి. అస్థిర వాతావరణ పరిస్థితుల కారణంగా దిగుబడి తగ్గడంతో హెచ్‌ఐయూఎల్, టాటా కంజ్యూమర్ వంటి కంపెనీలు ఇటీవల టీ ధరలు పెంచాయి. సెప్టెంబర్ త్రైమాసికం ఎర్నింగ్ కాల్స్ సందర్భంగా అనేక లిస్టెడ్ కంపెనీలు తమ మార్జిన్లను కాపాడుకోవడానికి ప్రస్తుత త్రైమాసికంలో సబ్బుల ధరలను సవరించాయి. పామాయిల్, కాఫీ, కోకో వంటి ముడి సరుకుల ధరలు పెరగడమే ఇందుకు కారణం. పామాయిల్ డెరివేటివ్స్ ధరలు గణనీయంగా పెరిగాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి 30 శాతం పెరిగాయని విప్రో కంజ్యూమర్ కేర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ నీరజ్ ఖత్రీ తెలిపారు.
ఇతర ఉత్పత్తులు సైతం..
దిగుమతి సుంఖం పెరగడంతో అంతర్జాతీయ ధరల పెరుగుదల కారణంగా సెపెబర్ మధ్య నుంచి పామాయిల్ ధరలు 35 నుంచి 40 శాతం పెరిగాయి. హెచ్‌ఐయూఎల్ కంపెనీకి చెందిన వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల ధరలు సైతం పెరిగాయి. టీ వంటి విభాగాలలో దశల వారీగా ధరలు 25 నుంచి 30 శాతం పెంచినట్లు టాటా కంజ్యూమర్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ఎండీ, సీఈవో సునీల్ తెలిపారు. అయితే వినియోగదారులపై ఒకేసారి భారం మోపకూడదని తాము నిర్ణయించామని గొద్రెజ్ కంజ్యూమర్స్ పొడక్ట్ వెల్లడించింది.
ధరల పెంపు ఇలా..
5 యూనిట్ల ప్యాక్ లక్స్ సబ్బుల ధర రూ.145 నుంచి రూ.155కి, లైఫ్‌బాయ్ ధర రూ.155 ఉంచి రూ.165కి పెరిగాయి. ఇక 4 యూనిట్ల పియర్స్ ప్యాక్ ధర రూ.149 నుంచి రూ.162కి పెరిగింది.