Flat Buying Guide: ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి చేయడం.. ఇల్లు కట్టుకోవడం ఒక కలగా ఏర్పాటు చేసుకుంటారు. సొంత ఇంట్లో ఉన్న సంతోషం ప్రత్యేకంగా ఉంటుందని చాలామంది తమ అనుభవాన్ని పంచుకుంటూ ఉంటారు. ఎంత సంపాదించినా.. ఎంత డబ్బు ఉన్నా సొంత ఇల్లు ఉంటేనే వారి జీవితం పరిపూర్ణం అని మరికొందరు అనుకుంటారు. ఈ నేపథ్యంలో సొంత ఇల్లు లేదా సొంతంగా స్థలం కొనుగోలు చేసి అందులో ఇంటిని నిర్మించుకుంటారు. ఉద్యోగాల కోసం గ్రామాలను వదిలి పట్టణాలకు వచ్చిన వారు ఇక్కడే ఒక ఫ్లాట్ తీసుకొని అందులో ఇల్లు కట్టుకోవాలని అనుకుంటారు. ఈ క్రమంలో చాలామంది ఫ్లాట్ అమ్మేవారు కొనేవారికి నేరుగా పరిచయం ఉండదు. అందువల్ల మధ్యలో కొందరు వీరిని ఏర్పాటు చేసుకొని ఫ్లాట్లను విక్రయిస్తూ ఉంటారు. ఇదే సమయంలో కొందరు ప్లాట్ కొనేవారికి మోసం చేసి విక్రయిస్తుంటారు. ఆ మోసాలు ఎలా ఉంటాయంటే..?
చాలామంది తొందరపడి లొకేషన్ నచ్చగానే ఫ్లాటు కొనుగోలు చేస్తారు. రిజిస్ట్రేషన్ పేపర్స్ సరిగా ఉన్నాయంటూ ఆన్లైన్లో ఈ ల్యాండ్ కు సంబంధించిన వివరాలు కనిపించాయి అంటూ నమ్ముతారు. కానీ ప్లాట్ కొనేముందు కొన్ని విషయాలు తప్పకుండా ఆలోచించాలి. ఇల్లు కట్టుకోవడానికి ప్లాట్ కొనుగోలు చేయాల్సివస్తే ముఖ్యంగా కొన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాలి. వాటిలో కొనే ఫ్లాట్ RERA చట్టం పరిధిలో ఉందా? లేదా? అనేది తెలుసుకోవాలి. ఒకవేళ ఈ పరిధిలో లేకపోతే ఆ ఫ్లాట్ కొనుగోలు చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు ఏర్పడతాయి. ఒకవేళ ఈ ఫ్లాట్ మోసపూరితమైనది అని తెలిస్తే భవిష్యత్తులో వారిపై ఫిర్యాదు చేయడానికి ఆస్కారం ఉండదు. అందువల్ల కొనుగోలు చేసే ఫ్లాట్ రెరా చట్టం పరిధిలో ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు.
నగరాల్లో ఫ్లాట్ కొనే సమయంలో ఆ ఫ్లాట్ మున్సిపల్ లేదా కమిషనరేట్ అనుమతి ఉందా? లేదా? అనేది చూసుకోవాలి. ఇలాంటి అనుమతి లేకపోతే భవిష్యత్తులో అందులో ఇల్లు నిర్మించుకునే అవకాశం ఉండదు. కొన్ని ప్లాట్లు ఇల్లు నిర్మించడానికి కాకుండా బఫర్ జోన్ వంటి వాటి పరిధిలో ఉంటాయి. ఇలా ఉంటే ఫ్లాట్‌లో ఇల్లు నిర్మించడానికి మున్సిపల్ లేదా కమిషనరేట్ అనుమతి ఇవ్వదు. అందువల్ల ఈ ఫ్లాట్ కు ఇలాంటి అనుమతి ఉంటేనే తీసుకోవడం మంచిది.
చాలామంది సొంతంగా భూమి ఉన్నవారు నేరుగా కొనుగోలుదారులకు ఫ్లాట్లను విక్రయించరు. కొందరు డెవలపర్స్ ల్యాండ్ తీసుకొని ఫ్లాట్లుగా విభజించి విక్రయిస్తారు. అయితే ఈ డెవలపర్స్ ఏ సంస్థకు చెందినవారు? వారి హిస్టరీ ఏంటి? అనే వివరాలు పక్కాగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే చాలా సంస్థలు చాలామందికి ఫ్లాట్ లను విక్రయించి వారి దగ్గర అడ్వాన్స్ తీసుకొని ఆ తర్వాత అనుమతి లేని ఫ్లాట్లను అప్పగించారు. దీంతో చాలామంది పోలీస్ స్టేషన్లోకి వెళ్లి ఫిర్యాదులు చేశారు. అందువల్ల ప్లాట్ కొనేముందు ఆ ఫ్లాట్లు ఏ సంస్థ విక్రయిస్తోంది అనేది తెలుసుకోవడం తప్పనిసరి.
ఇక ఫ్లాట్ కొనే ముందు దీని దగ్గర స్కూల్స్ హాస్పిటల్స్ ఉన్నాయా? లేవా? అనేది కూడా చూడడం మంచిది. కొందరు ఇవి దగ్గరే ఉన్నాయని చెప్పి ఎక్కువ ధరకు విక్రయిస్తూ ఉంటారు. అందువల్ల ముందే సమీపంలో స్కూల్స్ లేదా హాస్పిటల్స్ ఉంటేనే ఎక్కువ ధరను వెచ్చించి ఫ్లాట్‌ను కొనుగోలు చేయాలి.