Paytm Loan: దేశీ దిగ్గజ డిజిటల్ పేమెంట్స్ సర్వీసెస్ సంస్థగా పేరు సంపాదించుకున్న పేటీఎం రుణాలు తీసుకోవాలని భావించే వాళ్లకు అదిరిపోయే తీపికబురు అందించింది. ఊహించని స్థాయిలో రుణాలను మంజూరు చేసి పేటీఎం వార్తల్లో నిలిచింది. పేటీఎం నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుని ఈ రుణాలను మంజూరు చేస్తుండటం గమనార్హం. పేటీఎం ఏకంగా 41 లక్షల మందికి రుణాలను మంజూరు చేసినట్టు తెలుస్తోంది.
పేటీఎం మంజూరు చేసిన రుణాల విలువ ఏకంగా 2,095 కోట్ల రూపాయలుగా ఉంటుందని సమాచారం అందుతోంది. పేటీఎం సంస్థ రుణ మంజూరులో ఏకంగా 449 శాతం పెరుగుదలను నమోదు చేసి వార్తల్లో నిలవడం గమనార్హం. పేటీఎం స్థూల మర్చండైజ్ వాల్యూ కూడా పెరిగిందని సమాచారం. మంచి క్రెడిట్ స్కోర్ ను కలిగి ఉన్నవాళ్లు రుణం కొరకు దరఖాస్తు చేసుకుంటే సులభంగా రుణం పొందవచ్చు.
Also Read: Nara Lokesh’s Letter To Jagan: జగన్ కు నారా లోకేష్ లేఖ.. కేసీఆర్ ను చూసి నేర్చుకోవాలట
ప్రస్తుతం పేటీఎం యాప్ ద్వారా లావాదేవీలను నిర్వహిస్తున్న యూజర్ల సంఖ్య 6.95 కోట్లుగా ఉందని తెలుస్తోంది. గతంతో పోలిస్తే పేటీఎంను వినియోగించే యూజర్ల సంఖ్య ఏకంగా 41 శాతం పెరిగింది. పేటీఎం విషయంలో యూజర్ ఎంగేజ్మెంట్ కూడా అంతకంతకూ పెరుగుతోందని సమాచారం అందుతోంది. మరోవైపు ఆర్బీఐ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కు భారీ షాక్ ఇవ్వడం గమనార్హం.
పేటీఎం యాప్ ద్వారా సులభంగా రుణం కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. పేటీఎం యాప్ భారీస్థాయిలో రుణాలను అందిస్తుండటంతో పేటీఎం యూజర్లకు ఊహించని స్థాయిలో ప్రయోజనం చేకూరనుంది.
Also Read: BJP Social Media Controversy: సరికొత్త వివాదం: బీజేపీకి ఫేస్ బుక్ మిత్రపక్షమా?