LIC Jeevan Shiromani: స్టాక్ మార్కెట్ లో డబ్బులను ఇన్వెస్ట్ చేయడం ద్వారా అదిరిపోయే లాభాలను సొంతం చేసుకోవచ్చనే సంగతి తెలిసిందే. అయితే స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్లకు కొన్నిసార్లు నష్టాలు కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుందని గుర్తుంచుకోవాలి. అయితే ఎల్ఐసీ జీవన్ శిరోమణి ప్లాన్ ద్వారా కచ్చితమైన లాభాలను పొందే అవకాశం అయితే ఉంటుంది. తక్కువ మొత్తం ఇన్వెస్ట్ చేసినా ఈ పాలసీ ద్వారా ఎక్కువ లాభాలు వస్తాయి.
ఈ ప్లాన్ నాన్ లింక్డ్ ప్లాన్ కాగా ఈ పాలసీలో ఇన్వెస్ట్ చేసిన వాళ్లు కనీసం కోటి రూపాయల హామీని అందుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ పాలసీ కనీస రాబడి కోటి రూపాయలు కావడంతో పాలసీని తీసుకున్న వాళ్లకు ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. 2017 సంవత్సరం డిసెంబర్ నెల 17వ తేదీన ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. జీవన్ శిరోమణి ప్లాన్ వ్యవధితో లింక్ చేయని ప్రీమియం చెల్లింపు మనీ బ్యాక్ ప్లాన్ కావడం గమనార్హం.
Also Read: మీ స్మార్ట్ ఫోన్ లో ఈ చిన్న రంధ్రాన్ని ఎప్పుడైనా గమనించారా..ఆ రంధ్రం ఎందుకుందో తెలుసా?
ఈ పాలసీ తీసుకున్న వ్యక్తి మరణిస్తే ఈ ప్లాన్ తీసుకున్న పాలసీదారుడికి మరణ ప్రయోజనం రూపంలో బెనిఫిట్ ను పొందే అవకాశం ఉంటుంది. ఈ పాలసీ ద్వారా పాలసీ యొక్క సరెండర్ విలువపై రుణాన్ని పొందే అవకాశం ఉంటుంది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిబంధనలు షరతుల ప్రకారం ఈ పాలసీని అందిస్తారు. పాలసీ వ్యవధి 14, 16, 18 , 20 సంవత్సరాలుగా ఉండగా 4 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.
18 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ పాలసీని తీసుకోవడానికి అర్హులని చెప్పవచ్చు. 4 సంవత్సరాల లోపు ప్రీమియం మొత్తాన్ని చెల్లించవచ్చు.
Also Read: వ్యక్తి మరణించిన తర్వాత పాన్ కార్డు, పాస్ పోర్ట్ ఏమౌతాయో తెలుసా?