Post Office Scheme: కేంద్ర ప్రభుత్వం పలు రకాల పొదుపు పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. బయటి మార్కెట్లో ఎన్నో మోసపూరిత కంపెనీలు ప్రజలను మభ్యపెట్టి డబ్బులు వసూలు చేసి.. ఆ తర్వాత బోర్డులు తిప్పేస్తుండడంతో.. కేంద్రమే రంగంలోకి దిగి పలు పొదుపు పథకాలను తెరపైకి తీసుకువచ్చింది. అలాంటి వాటిల్లో ఇది ఉత్తమమైన పథకం..ఇది పోస్టాఫీస్ లో అందుబాటులో ఉంది.
ఈ పథకం పేరు సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీం. ఈ పథకం ద్వారా సీనియర్ సిటిజన్లు ప్రతినెలా స్థిరమైన ఆదాయాన్ని అందుకోవచ్చు. వృద్ధులను దృష్టిలో పెట్టుకొని కేంద్రం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకంలో 1000 నుంచి పెట్టుబడి పెట్టడం మొదలుపెట్టొచ్చు. ఇందులో గరిష్టంగా 30 లక్షల వరకు పెట్టుబడి పెట్టేందుకు అవకాశం ఉంది. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే 80 సి కింద పన్ను మినహాయింపు పొందేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి వృద్ధులకు ముఖ్యంగా ఉద్యోగులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. 60 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తులను దృష్టిలో ఉంచుకొని ఈ పథకాన్ని రూపొందించారు కాబట్టి.. అందువల్ల ఎవరైనా పదవి విరమణ తర్వాత సాధారణ ఆదాయాన్ని పొందొచ్చు. వలంటరీ రిటైర్మెంట్ సర్వీస్ తీసుకున్న వారికి కూడా ఈ పథకం వర్తిస్తుంది.
ఈ పథకం కింద కేంద్రం 8.2 శాతం వడ్డీ ఇస్తోంది. ఉదాహరణకు ఈ పథకంలో 15 లక్షలు డిపాజిట్ చేస్తే.. వారు ప్రతి త్రైమాసికంలో 10,250 ఆదాయం పొందొచ్చు. అంతేకాదు ఐదు సంవత్సరాలలో వడ్డీ నుంచి రెండు లక్షల వరకు వస్తుంది. ఒకవేళ రిటైర్మెంట్ డబ్బును 30 లక్షల వరకు ఇందులో పెట్టుబడిగా పెడితే వార్షికంగా 2,46,000 వడ్డీ లభిస్తుంది. ఈ లెక్కన నెల ప్రకారం రూ. 20,500, త్రైమాసిక ప్రాతిపదికన 61,500 పొందొచ్చు.
గణన ఇలా ఉంటుంది
డిపాజిట్ చేసిన డబ్బు 30 లక్షలు అనుకుంటే..
కాలం: ఐదు సంవత్సరాలు
వడ్డీ రేటు: 8.2%
మెచ్యూరిటీపై వచ్చే డబ్బు: 42,30,00
వడ్డీ ఆదాయం: 12,30,00
త్రైమాసిక ఆదాయం: 61,500
నెలవారీ ఆదాయం: 20,500
వార్షిక వడ్డీ: 2,46,000
ఈ పథకాన్ని కేంద్రం అమలు చేస్తోంది కాబట్టి ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80 సీ కింద ప్రతి ఏడాది 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ప్రయోజనం లభిస్తుంది. ప్రతి ఏడాది 8.2 శాతం చొప్పున వడ్డీ లభిస్తుంది. పైగా ఇందులో ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ డబ్బులు అందుతాయి. ప్రతి ఏడాది ఏప్రిల్, జూలై, అక్టోబర్, జనవరి నెలలో వడ్డీ ఖాతాలో జమవుతుంది.