https://oktelugu.com/

Electric Car: ధర రూ.3.6 లక్షలు.. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 200 కిలోమీటర్లు వెళ్లొచ్చు..

ధర రూ.3.99 లక్షలు.. ఒక్కసారి ఛార్జీంగ్ చేస్తే 200 కిలోమీటర్లు వెళ్లొచ్చు.. ఇలాంటి కారు గురించి ఎవరైనా కొనాలని అనిపిస్తుంది. కానీ ఈ కారు ఇక్కడిది కాదు. చైనాకు చెందిన ఈవీ. చైనాలోని చాల్స్ అనే కంపెనీ కొత్త ఈవీని అందుబాటులోకి తీసుకొచ్చింది.

Written By:
  • Srinivas
  • , Updated On : May 6, 2024 12:37 pm
    China Rainbow mini Ev

    China Rainbow mini Ev

    Follow us on

    Electric Car: కారు కొనాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ ఏ కారు కొనాలి? అనే సందేహంలో చాలా మంది ఉంటున్నారు. ఇప్పుడుంతా ఎలక్ట్రిక్ కార్లదే హవా సాగుతోంది. చాలా కంపెనీలు ఈవీలను అందుబాటులోకి తీసుకురావడంతో వినియోగదారులు వాటికే మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే ఓ వైపు పెట్రోల్, డీజీల్ రేట్లు అధికంగా ఉండడంతో పాటు వాతావరణం కాలుష్యం దృష్ట్యా ఈవీలే ఎక్కువగా ఆదరణ పొందుతున్నాయి. అయితే ఎలక్ట్రిక్ కార్ల ధరలు ప్రస్తుతం అధికంగానే ఉన్నాయి. కానీ లేటేస్టుగా ఓ కారు ధర రూ.3.99 లక్షలకే విక్రయిస్తున్నారు. ఇంతకీ ఆ కారు ఏదో తెలుసా..?

    ధర రూ.3.99 లక్షలు.. ఒక్కసారి ఛార్జీంగ్ చేస్తే 200 కిలోమీటర్లు వెళ్లొచ్చు.. ఇలాంటి కారు గురించి ఎవరైనా కొనాలని అనిపిస్తుంది. కానీ ఈ కారు ఇక్కడిది కాదు. చైనాకు చెందిన ఈవీ. చైనాలోని చాల్స్ అనే కంపెనీ కొత్త ఈవీని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనికి ‘రెయిన్ బో మినీ ఈవీ’ అని పేరు పెట్టింది. ఎంజీ కామెంట్ అనే కారు ను పోలి ఉన్న దీని డిజైన్ ఆకర్షణీయంగా ఉంది. ఇందులో నలుగురు ప్రయాణికులు సురక్షితంగా ప్రయాణం చేయొచ్చు.

    ఈ కారు స్పోక్ స్టీరింగ్ వీల్, ఎల్ సీడీ ఇనుస్ట్రుమెంట్ ను కలిగి ఉంది. మొబైల్ ఫోన్ రిమోట్ కంట్రోల్ తో పనిచేస్తుంది. ఈ కారులో 20 kWh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 85 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. లిథియం అయాన్ బ్యాటరీని కలిగి ఉన్న ఇందులో వివిధ వేరియంట్లు కలిగి ఉన్నాయి. అలాగే వెహికల్ అన్ లాకింగ్ సిస్టమ్, ఓటీఏ అప్డేట్స్, 20 స్టేరజ్ స్పేషెస్ వంటివి ఆకర్షిస్తాయి. మొత్తం మూడు బ్యాటరీలను ఇందులో అమర్చారు.

    ఈ బ్యాటరీల్లో 17.3 కిలో వాట్ కలిగినది ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 201 కిలోమీటర్ల వరకు వెళ్లొచ్చు. బ్యాటరీ కెపాసిటీ తగ్గిన కొద్దీ మైలేజ్ తగ్గుతుంది. ఈ కారు ధరను 4400 డాలర్లుగా కేటాయించారు. గరిష్టంగా 6 వేల డాలర్లతో విక్రయిస్తున్నారు. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం ఈ కారు ధర రూ.3.6 లక్షలు మాత్రమే. అయితే ఈ కారు ప్రస్తుతం చైనాలోనే అందుబాటులో ఉంది.