Crossandra Flower Cultivation: పూలలో ఎన్నో రకాలు ఉన్నా కనకాంబరం పూలు ఎంతో ప్రత్యేకమనే సంగతి తెలిసిందే. మహిళలు ఈ పూలను ఎంతగానో ఇష్టపడతారు. ఇతర పూలతో పోలిస్తే కనకాంబరం పూలకు డిమాండ్ ఎక్కువగా ఉండటంతో పాటు ఈ పూల ధర ఎక్కువగా ఉంటుంది. కొన్ని ప్రాంతాలలో కనకాంబరం పూల ధర కిలో 700 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు ఉండటంతో ఈ పూల సాగు ద్వారా లక్షల్లో ఆదాయం పొందే అవకాశం అయితే ఉంటుంది.

చిన్న, సన్నకారు రైతులు కనకాంబరం సాగుపై ఎక్కువగా ఆసక్తి చూపుతుండటం గమనార్హం. కనకాంబరంను మూడు సంవత్సరాలు సాగు చేయడం ద్వారా సంవత్సరానికి 1,800 కిలోల నుంచి 2,500 కిలోల వరకు దిగుబడిని పొందే అవకాశం ఉంటుంది. మంచి యజమాన్య పద్ధతులను పాటించడం ద్వారా 3 నెలలలోనే పూత ప్రారంభం అయ్యే అవకాశం అయితే ఉంటుంది. కనకాంబరం సాగు ద్వారా జూన్ నెల నుంచి జనవరి వరకు ఎక్కువ రాబడిని పొందే అవకాశం అయితే ఉంటుంది.
అలంకరణ కోసం ఈ పూలను ఎక్కువగా వినియోగించడం జరుగుతుంది. నారింజ, పామాయిల్, కొబ్బరి తోటలలో అంతరపంటగా కూడా కనకాంబరం సాగును చేపట్టవచ్చు. ఎక్కువగా పురుగు మందులు వినియోగించకుండానే తక్కువ ఖర్చుతో కనకాంబరం సాగును చేపట్టవచ్చు. సొంతంగా భూమి ఉన్న రైతులు సంవత్సరం పొడవునా కనకాంబరం సాగును చేపట్టవచ్చు.
ఉదయం సాయంత్రం వేళల్లో ఈ పూలను కోయాల్సి ఉంటుంది. కిలోకు 15,000 వరకు పూలు తూగే అవకాశం ఉంటుంది. సొంతంగా భూమి ఉండే రైతులు సంవత్సరం పొడవునా ఆదాయం పొందాలని భావిస్తే కనకాంబరం సాగును చేపట్టవచ్చు. కనకాంబరం సాగుకు సంబంధించి నులిపురుగుల బెడద, ఎండు తెగులు సమస్య ఎక్కువగా ఉంటుంది.