https://oktelugu.com/

Gold Prices: వరుసగా షాక్ ఇస్తున్న బంగారం ధరలు.. నేడు ఎలా ఉన్నాయో తెలుసా?

బులియన్ మార్కెట్ ప్రకారం.. జనవరి 21న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,800గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.63,050 గా ఉంది. జనవరి 20న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,700తో విక్రయించారు. శనివారంతో పోలిస్తే ఆదివారం బంగారం ధరలు రూ.100 పెరిగింది.

Written By:
  • Srinivas
  • , Updated On : January 21, 2024 / 08:38 AM IST

    Gold Prices

    Follow us on

    Gold Prices: కొన్ని రోజులుగా వరుసగా తగ్గిన బంగారం ధరలు మళ్లీ వరుసగా పెరుగుతున్నాయి. దీంతో చాలా మంది కొనగోలుదారులు బంగారం కొనుగోలును వాయిదా వేసుకుంటున్నారు. అయితే వెండి ధరలు మాత్రం తగ్గతున్నాయి. దేశంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

    బులియన్ మార్కెట్ ప్రకారం.. జనవరి 21న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,800గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.63,050 గా ఉంది. జనవరి 20న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,700తో విక్రయించారు. శనివారంతో పోలిస్తే ఆదివారం బంగారం ధరలు రూ.100 పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

    న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,950 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.63,200గా నమోదైంది. ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,800 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.63,050 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.58,250 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.63,550తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.57,800 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.63,050తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.57,800తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.63,050తో విక్రయిస్తున్నారు.

    బంగారం ధరలు పెరిగినా వెండి ధరలు మాత్రం తగ్గాయి. ఆదివారం ఓవరాల్ గా కిలో వెండి రూ.75,500గా నమోదైంది. శనివారంతో పోలిస్తే ఆదివారం వెండి రూ.200 మేర తగ్గింది. న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.75,500గా ఉంది. ముంబైలో రూ.75,500, చెన్నైలో రూ.77,000, బెంగుళూరులో 73,250, హైదరాబాద్ లో రూ.77,000తో విక్రయిస్తున్నారు.