Deposit Interest Rates: 2023 సంవత్సరం జూలై అతి త్వరలో పూర్తవుతుంది..ఆ తరువాత ఆగస్టు ప్రారంభమవుతుంది.. ప్రతి సంవత్సరం లాగే నెల మారుతుంది. కానీ ఇందులో కొత్త ఏముంది? అని చాలామందికి డౌట్ రావచ్చు. అయితే అసలు విషయం ఇక్కడే ఉంది. ప్రతి ఏడాది ఆగస్టులో ఫైనాన్షియల్ గా రూల్స్ మారుతూ వస్తున్నాయి. 2023 ఆగస్టు లోను కొత్త రూల్స్ తో పాటు కొత్త స్కీమ్స్ వస్తున్నాయి. బ్యాంకు క్రెడిట్ కార్డు నుంచి సిలిండర్ వరకు విధానాలు మారే అవకాశం ఉంది. అవేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే కిందికి వెళ్ళండి.
2023 ఆగస్టులో కొన్ని బ్యాంకులు కొత్త స్కీం లను అందుబాటులోకి తెస్తున్నాయి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియా బ్యాంక్, ఐడీబీఐ లుఅధిక వడ్డీ రేట్లు వచ్చే కొన్ని స్కీమ్స్ ను ఆగస్టు ఒకటి నుంచి ప్రవేశపెడుతున్నాయి. వీటికి ఏడాది వరకు కాల పరిమితిని పెట్టింది. ఒక్క ఏడాదిలోగా అత్యధిక వడ్డీ వచ్చే కొన్ని పథకాల గురించి తెలుసుకుందాం..
బ్యాంకుల్లో అతి పెద్దది ఎక్కువ మంది ఖాతాలను కలిగినది ఎస్బిఐ. ఈ బ్యాంక్ ఆగస్టులో తన వినియోగదారుల కోసం కొత్త స్కీంను ప్రవేశపెడుతుంది. దీని పేరు అమృత్ కలశ్. రెగ్యులర్ వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని ఆగస్టు 15 నుంచి దీనిని అందుబాటులోకి తెస్తుంది. అమృత్ కలశ్ స్కీం ప్రకారం 400 రోజులు డిపాజిట్ చేస్తే 7.1 వడ్డీని పొందవచ్చు. సీనియర్ సిటిజన్స్ కైతే 7.5 ఇంట్రెస్ట్ పే చేసేందుకు ఛాన్స్ ఉంది. ఇండియన్ బ్యాంకు లోను ఇదే స్కీం ను అమలు చేస్తున్నారు. దీనికి సూపర్ 400 డేస్ అని పేరు పెట్టారు. ఆగస్టు 31 లోగా మాత్రమే ఈ స్కీం లో చేరడానికి ఛాన్స్ ఇచ్చింది. ఇండియన్ బ్యాంకులో మరో స్కీమ్ సూపర్ 300 డేస్ అనే స్కీంను ప్రవేశపెట్టింది ఇందులో రూ.2 కోట్ల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. ఇలా చేస్తే 7.8 వడ్డీ చెల్లిస్తుంది
ఐడిబిఐ బ్యాంకులో అమృత్ మహోత్సవ పేరిట 375 రోజులు డిపాజిట్ చేస్తే 7.5 నుంచి 7.8 వరకు వడ్డీ చెల్లిస్తుంది ఆగస్టు 15 వరకు మాత్రమే ఈ స్కీం లో చేరొచ్చు.
పై బ్యాంకులు స్కీంలు ప్రవేశ పెడితే.. యాక్సిస్ బ్యాంక్ మాత్రం క్రెడిట్ కార్డ్ పాయింట్ల ఈ నెల నుంచే తగ్గిస్తుంది ఇవే కాకుండా సిలిండర్ ధరల్లోను మార్పులు జరిగే అవకాశం ఉందని ఫైనాన్స్ నిపుణులు తెలుపుతున్నారు.