Quick Commerce Delivery Agents : వ్యాపారం రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది. మనిషి అవసరాలకు అనుగుణంగా సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. ఒకప్పుడు సరుకులు, కూరగాయలు మార్కెట్‌కు వెళ్లి కొనుక్కునేవారం. ఇప్పుడు ఇంటికే వస్తున్నాయి. ఇక ఒకప్పుడు బిర్యానీ తినాలంటే హోటల్‌కు వెళ్లేవారం.. ఇప్పుడు ఇంటికే బిర్యానీతోపాటు కేక్‌లు, ఇతర ఆహార పదార్థాలు వస్తున్నాయి. ఈ రంగంలో పోటీ పెరగడంతో క్విట్ డెలివరీలకు ప్రాధాన్యం ఉంటుంది. ఒక్క క్లిక్‌తో 10–15 నిమిషాల్లో డోర్‌స్టెప్ డెలివరీ అలవాటు మార్చేసింది. బ్లింకిట్, జెట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ వంటి ప్లాట్‌ఫారమ్‌లు రోజువారీ అవసరాలను తమ గ్రిడ్‌లోకి తీసుకువచ్చాయి. ఇది సౌకర్యంగా కనిపించినా, వినియోగదారులను ఆకర్షించే క్విక్ కమార్స్ వెనుక ‘డార్క్ ప్యాటరన్స్’ దాగి ఉన్నాయి.
డెలివరీ ఏజెంట్ల ఒత్తిడి..
క్విక్ డెలివరీ వెనుక వేలాది ఏజెంట్ల శ్రమ. రోజుకు 50–60 ఆర్డర్లు, ట్రాఫిక్ సమస్యలు, మార్గదర్శకాల లోపాలతో ఒత్తిడి. ఇంటర్నెట్ డౌన్ అయితే ఆర్డర్లు క్యాన్సిల్, రేటింగ్‌లు పడిపోతాయి. 2024 లెక్కల ప్రకారం భారత్‌లో 2 లక్షల మంది రైడర్లు ఈ రంగంలో పనిచేస్తున్నారు. తాజా అధ్యయనాల ప్రకారం, 40% ఏజెంట్లు ఆరోగ్య సమస్యలు (వెన్నెముక నొప్పి, అలసట) ఎదుర్కొంటున్నారు. బోనస్‌ల కోసం అర్ధరాత్రి పని చేస్తున్నారు. భద్రత లేకుండా రోడ్ల మీద పోరాటం చేస్తున్నారు. ఇది మానవ హక్కుల ప్రశ్నలకు దారి తీస్తోంది.
ఆర్థిక నష్టాలు..
క్విక్ కామర్స్ కంపెనీలు వేగంగా విస్తరిస్తున్నా, నష్టాలు భారీగా ఉన్నాయి. 2025 మార్కెట్ వాల్యూ రూ.10 వేల కోట్లు, కానీ ఒక్క బ్లింకిట్ 2024లో రూ.2 వేల కోట్ల నష్టం. చల్లని గ్రిడ్‌లు (డార్క్ స్టోర్స్) నిర్మాణం, ఇన్వెంటరీ స్పాయిలేజ్ (ఆహారం చెడిపోవడం) కారణాలు. పెద్ద సంఖ్యలో డెలివరీలకు ప్లాస్టిక్ ప్యాకేజింగ్, ఇంధన వాడకం. ఒక రోజు కోటి డెలివరీలు అంటే కార్బన్ ఉద్గారాలు 20% పెరుగుతాయి. దీర్ఘకాలికంగా ఈ మోడల్ నిలవచ్చా అనేది ప్రశ్నార్థకం.
క్విక్ కామర్స్ సౌకర్యాలు అందిస్తున్నా, డార్క్ ప్రాక్టీసెస్‌ను నియంత్రించాలి. ప్రభుత్వం ఏజెంట్ల భద్రత, డార్క్ ప్యాటరన్స్‌పై నిబంధనలు తీసుకుంటే మంచిది. వినియోగదారులు బాధ్యతాయుతంగా ఆర్డర్ చేస్తే, రంగం సుస్థిరంగా మారుతుంది.