Homeబిజినెస్Credit Card : క్రెడిట్ కార్డు మినిమమ్ బిల్లు కడుతున్నారా.. లాభాలు నామమాత్రం.. నష్టాలు కొండంత!

Credit Card : క్రెడిట్ కార్డు మినిమమ్ బిల్లు కడుతున్నారా.. లాభాలు నామమాత్రం.. నష్టాలు కొండంత!

Credit Card : ఒకప్పుడు ఏదైనా కొనాలంటే డబ్బులుంటేనే పని జరిగేది. కానీ ఇప్పుడు క్రెడిట్ కార్డులొచ్చాక సీన్ కంప్లీటుగా మారిపోయింది. క్షణాల్లో అప్పు రెడీ, కావాల్సినవన్నీ కొనేసుకోవచ్చు. చేతిలో పైసా లేకపోయినా క్రెడిట్ కార్డు ఉంటే షాపింగ్ ఎంతైనా చెయ్యొచ్చు. ఇక్కడిదాకా బాగానే ఉంది కానీ అసలు కథ బిల్లు వచ్చినప్పుడే మొదలవుతుంది. కొందరు డబ్బులున్నా క్రెడిట్ కార్డు వాడి తర్వాత బిల్లు కట్టేస్తారు. మరికొందరు ఏమీ లేకపోయినా కార్డుతో ఇష్టమొచ్చినట్టు ఖర్చు చేసి తర్వాత ఏం చెయ్యాలో తెలియక ‘మినిమం అమౌంట్ అయినా కడదాం’ అని కొద్ది మొత్తంలో పే చేస్తారు. ఇలా చేయడం వల్ల లాభాలుంటాయా? నష్టాలు వస్తాయా? ఈ కథనంలో తెలుసుకుందాం.

Also Read : జుకర్‌బర్గ్ నెక్స్ట్ టార్గెట్ ఇదే..స్మార్ట్‌ఫోన్‌లకు ఎండ్ కార్డ్ పడ్డట్లేనా ?

క్రెడిట్ కార్డు బిల్లు వచ్చినప్పుడు మనకు మూడు ఆప్షన్లు కనిపిస్తాయి.. మినిమం అమౌంట్ కట్టడం, మొత్తం బిల్లు కట్టడం, లేదా కొంచెం డబ్బులు కట్టడం. నెలనెలా మొత్తం బిల్లు కడితే ఎలాంటి టెన్షన్ ఉండదు. కానీ బిల్లు మొత్తం కట్టకుండా ఆ నెలలో కొంచెం తక్కువ అమౌంట్ కట్టడాన్నే ‘మినిమమ్ డ్యూ’ అంటారు. దాదాపు అన్ని బ్యాంకులు ఈ సౌకర్యం ఇస్తున్నాయి. చాలా బ్యాంకులు మొత్తం బిల్లులో 5 శాతం అయినా కనీసంగా కట్టమని అంటాయి. బ్యాంకులను బట్టి ఈ శాతం కాస్త అటూ ఇటూ ఉండొచ్చు. చాలామంది ‘మినిమమ్’ కడితే వడ్డీ పడదని అనుకుంటారు. కానీ అది అస్సలు నిజం కాదు.. కనీసం ఇంతైనా కడితే లేట్ ఫీజులు, పెనాల్టీల నుంచి మాత్రమే కాస్త రిలీఫ్ వస్తుంది. మీరు కట్టాల్సిన అసలు డబ్బుల మీద మాత్రం బ్యాంక్ బాగా వడ్డీ వేస్తుంది.

ఎవరైనా ఒక నెలలో క్రెడిట్ కార్డుతో రూ.20 వేలు ఖర్చు చేశాడు అనుకుందాం. జూన్‌లో ఆ బిల్లు కట్టాలి. కానీ అతని దగ్గర డబ్బులు లేకపోతే కనీసం ఒక వెయ్యి రూపాయలు కట్టి గండం గట్టెక్కొచ్చు. కానీ తర్వాత నెలలో మిగిలిన రూ.19 వేలతో పాటు దానిపై బ్యాంక్ వేసే వడ్డీ కూడా కట్టాలి. ఆ నెలలో మళ్లీ కొంచెం షాపింగ్ చేస్తే అది కూడా తర్వాత బిల్లులో కలుస్తుంది. అంటే అప్పు అనేది పెరుగుతూనే ఉంటుందన్న మాట.

‘మినిమమ్ బిల్లు’ కడితే ఏం జరుగుతుంది? లాభాలు అంతంత మాత్రమే కానీ నష్టాలు మాత్రం చాలా

లాభాలు (చూడటానికి మాత్రమే):
ఆ నెలలో పెద్ద మొత్తంలో బిల్లు కట్టే బాధ తప్పుతుంది. అప్పటికప్పుడు కొంచెం హాయిగా అనిపిస్తుంది.మీ అకౌంట్ బాగానే ఉందన్నట్టు చూపిస్తుంది. అంటే బ్యాంక్ మిమ్మల్ని ‘అప్పు ఎగ్గొట్టేవాడు’ అని అనుకోదు. తక్కువ డబ్బులు కట్టడం వల్ల బ్యాంకులు మీ దగ్గర నుంచి లేట్ ఫీజులు లాగవు. మినిమమ్ డ్యూ కడితే క్రెడిట్ బ్యూరోలకు ‘వీడు సరిగ్గా కట్టట్లేదు’ అనే విషయం వెళ్లదు. దాని వల్ల మీ క్రెడిట్ స్కోర్ కొంచెం కాపాడుకోవచ్చు.

నష్టాలు (ఇవి మాత్రం చాలా డేంజర్):
కనీస మొత్తం కడితే బ్యాంకులు మీ మీద పిచ్చెక్కినట్టు వడ్డీ వేస్తాయి. మీరు కట్టాల్సిన అసలు డబ్బుల మీద దాదాపు 36 శాతం నుంచి 48 శాతం వరకు వడ్డీ లాగేస్తాయి. అంటే మీ అప్పు చాలా స్పీడ్‌గా పెరుగుతుంది. కొన్ని నెలల పాటు మీరు ఇలాగే కనీసం ఇంతైనా కడుతూ పోతే వడ్డీతో పాటు మీ అప్పుల భారం కొండలా తయారవుతుంది. దాన్ని తీర్చడానికి మీరు ఇంకొంచెం అప్పు చేయాల్సి రావచ్చు. దీంతో మీరు అప్పుల ఊబిలో పూర్తిగా కూరుకుపోయే ప్రమాదం ఉంది. కనీస మొత్తం కట్టడం, దానిపై మళ్లీ వాడుతూ పోవడం వల్ల మీ క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో బాగా పెరిగిపోతుంది. దీనివల్ల మీ క్రెడిట్ స్కోర్‌పై చాలా దెబ్బ పడుతుంది. భవిష్యత్తులో లోన్లు, కొత్త క్రెడిట్ కార్డులు తీసుకోవడం చాలా కష్టమవుతుంది.

నెలనెలా మీ క్రెడిట్ కార్డు అప్పును వాయిదా వేసుకుంటూ పోతే, కొత్తగా లోన్లు లేదా క్రెడిట్ కార్డులు కావాలంటే బ్యాంకులు మీకు ఇవ్వడానికి భయపడతాయి. మీకు లోన్ ఇస్తే రిస్క్ అని అవి అనుకుంటాయి. చాలా మంది క్రెడిట్ కార్డును ఎమర్జెన్సీ ఫండ్ లాగా అనుకుంటారు. కానీ మీరు మినిమమ్ బిల్లు కడుతూ పోతే నిజంగా అవసరం వచ్చినప్పుడు మీ క్రెడిట్ లిమిట్ తగ్గిపోయి ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి క్రెడిట్ కార్డు ఉంటే చాలా జాగ్రత్తగా వాడాలి. వీలైనంత వరకు మొత్తం బిల్లు ఒకేసారి కట్టడానికి చూడాలి. ‘మినిమమ్ డ్యూ’ అనేది అప్పటికి కొంచెం రిలీఫ్‌గా అనిపించినా భవిష్యత్తులో అది మిమ్మల్ని పెద్ద ఆర్థిక కష్టాల్లోకి నెట్టేస్తుంది అని గుర్తుపెట్టుకోండి.

 

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular