https://oktelugu.com/

భారతీయ డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఏయే దేశాల్లో చెల్లుబాటు అవుతుందో మీకు తెలుసా?

వాహనాలు నడిపే వాళ్లు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ ను కలిగి ఉండాలి. మన దేశంలో డ్రైవింగ్ లైసెన్స్ ను కలిగి ఉన్నవాళ్లు ఆ లైసెన్స్ ను ఇతర దేశాల్లో కూడా చెల్లుబాటు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని గుర్తుంచుకోవాలి. మన దేశ డ్రైవింగ్ లైసెన్స్ మన దేశం కాకుండా మరో పది దేశాలలో చెల్లుబాటు అవుతుంది. ఇతర దేశాలలోని రోడ్లపై కూడా మన దేశ డ్రైవింగ్ లైసెన్స్ అహాయంతో వాహనాలను నడపవచ్చు. న్యూజిలాండ్ లో బస చేసే […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 11, 2021 8:14 am
    Follow us on

    వాహనాలు నడిపే వాళ్లు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ ను కలిగి ఉండాలి. మన దేశంలో డ్రైవింగ్ లైసెన్స్ ను కలిగి ఉన్నవాళ్లు ఆ లైసెన్స్ ను ఇతర దేశాల్లో కూడా చెల్లుబాటు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని గుర్తుంచుకోవాలి. మన దేశ డ్రైవింగ్ లైసెన్స్ మన దేశం కాకుండా మరో పది దేశాలలో చెల్లుబాటు అవుతుంది. ఇతర దేశాలలోని రోడ్లపై కూడా మన దేశ డ్రైవింగ్ లైసెన్స్ అహాయంతో వాహనాలను నడపవచ్చు.

    న్యూజిలాండ్ లో బస చేసే విదేశీయులు మాతృదేశ డ్రైవింగ్ లైసెన్స్ తో సంవత్సరం పాటు వాహనాలను నడపవచ్చు. అయితే ఏ వాహనం మంజూరు అయిందో ఆ వాహనాన్ని మాత్రమే నడపాలనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అలా చేయకపోతే అక్కడి అధికారులు చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంటుంది. మన దేశ లైసెన్స్ కు హాంగ్ కాంగ్ లో కూడా అనుమతి ఉంది. టూర్ ను ఎక్కువరోజులు ప్లాన్ చేసుకునే వాళ్లు వాహనాలను అద్దెకు తీసుకుని ఇండియన్ లైసెన్స్ తో నడిపే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.

    భారత డ్రైవింగ్ లైసెన్స్ సింగపూర్ లో సంవత్సరం పాటు పని చేస్తుంది. అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే మాత్రం ఆ దేశం మొత్తం చుట్టేసే అవకాశం ఉంటుంది. ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ కు స్వీడన్ లో అనుమతి లభిస్తుంది. అయితే లైసెన్స్ ఇంగ్లీష్ లో ఉంటే మాత్రమే అక్కడ డ్రైవింగ్ చేయవచ్చు. మలేషియా రోడ్లపై వాహనాలు నడపాలంటే కూడా డ్రైవింగ్ లైసెన్స్ ఇంగ్లీష్ లో ఉండాలి.

    దక్షిణాఫ్రికాలో లైసెన్స్ పై ఫోటో, సంతకంతో పాటు లైసెన్స్ కాపీ ఇంగ్లీష్ లో ఉండాలి. ప్రస్తుత కాలానికి చెందిన లైసెన్స్ లకు మాత్రమే అక్కడ అనుమతి ఉంటుంది. స్విట్జర్లాండ్ లో ఇంగ్లీష్ లో డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవాళ్లు వాహనం నడుపుకునే ఛాన్స్ ఉంటుంది. లైసెన్స్ తో వాహనాలను లీజుకు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఆస్ట్రేలియాలో కూడా మన దేశ లైసెన్స్ కు అనుమతి ఉంటుంది. అయితే చిన్నచిన్న షరతులు ఉంటాయి. బ్రిటన్, స్కాట్లాండ్‌, ఇంగ్లాండ్‌, వేల్స్‌ దేశాలలో ఏడాదిపాటు మన దేశ లైసెన్స్ తో వాహనాలను నడుపుకోవచ్చు.