CNG Bike : ప్రపంచవ్యాప్తంగా ఆటోమొబైల్ మార్కెట్లో బజాజ్ ఫ్రీడమ్ 125 మొట్టమొదటి సీఎన్జీ బైక్. ఈ మోటార్ సైకిల్ మార్కెట్లోకి విడుదల అయి దాదాపు 8నెలలు అవుతోంది.క్రమంగా దేశంలోని అనేక నగరాల్లో దీని ఆధిపత్యం నడుస్తోంది ఆధిపత్యం చెలాయిస్తోంది. ఇప్పటివరకు 50 వేలకు పైగా యూనిట్లు అమ్ముడయ్యాయి. దీనిలోని ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇప్పుడు చాలా కంపెనీలు సీఎన్జీతో నడిచే ద్విచక్ర వాహనాలపై పనిచేస్తున్నాయి. ఇప్పుడు టీవీఎస్ సీఎన్జీ స్కూటర్ కూడా త్వరలో మార్కెట్లోకి రాబోతుంది. దీనిని కంపెనీ ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ప్రవేశపెట్టింది. ఇప్పుడు బజాజ్ తన CNG పోర్ట్‌ఫోలియోను మిగతా బైక్స్ కు కూడా విస్తరించాలని యోచిస్తోంది.
Also Read : ఈ బైక్ బుక్ చేశారా.. డెలివరీ కావాలంటే ఇంకా వెయిట్ చేయాల్సిందే
బైక్ వేల్ నివేదిక ప్రకారం.. కంపెనీ ఇప్పుడు ఫ్రీడమ్ లైనప్‌ను విస్తరించాలని చూస్తోంది. ప్రస్తుతం ఇది మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో డ్రమ్, డ్రమ్ LED, డిస్క్ LED వేరియంట్‌లు ఉన్నాయి. ఫ్రీడమ్ 125cc ఇంజిన్‌తో పనిచేస్తుంది. అయితే కంపెనీ ఈ CNG టెక్నాలజీని పెద్ద డిస్‌ప్లేస్‌మెంట్‌లు కలిగిన మోటార్‌సైకిళ్లకు కూడా తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి రాబోయే 12 నుంచి 18 నెలల్లో 150సీసీ CNG బైక్‌లు దేశంలోకి వచ్చే అవకాశం ఉంది. ఈ మార్గం CNG బైక్ ద్వారా తక్కువ రన్నింగ్ ఖర్చులతో.. కొంచెం ఎక్కువ పర్ఫామెన్స్ కోరుకునే కస్టమర్లను ఆకర్షించడానికి కంపెనీని ప్రయత్నిస్తుంది.
బజాజ్ ఫ్రీడమ్‌లో 125సీసీ సింగిల్-సిలిండర్ ఇంజన్ ఉంది. ఇది పెట్రోల్, CNG రెండింటిలోనూ నడుస్తుంది. ఈ ఇంజిన్ 9.5 PSపవర్, 9.7 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ మోటార్ సైకిల్ లో సీఎన్జీ సిలిండర్ సీటు కింద అమర్చబడి ఉంటుంది. ఈ CNG సిలిండర్ అస్సలు కనిపించని విధంగా ఉంటుంది. ఇందులో 2KG సీఎన్జీ సిలిండర్, 2-లీటర్ పెట్రోల్ ట్యాంక్ ఉన్నాయి. ఇది 100 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.
ఇది 125cc విభాగంలో అతిపెద్ద సీటును కలిగి ఉంది. దీని ఎత్తు 785 మి.మీ. ఈ సీటు చాలా పొడవుగా ఉంది. ఇద్దరు వ్యక్తులు హాయిగా కూర్చోవచ్చు. ఇది స్ట్రాంగ్ రోబస్ట్ ట్రైల్‌లెస్ ఫ్రేమ్‌ను కలిగి ఉంది. ఈ మోటార్ సైకిల్ LED హెడ్‌ల్యాంప్‌తో డ్యూయల్ కలర్ గ్రాఫిక్స్‌తో వస్తుంది. దీనివల్ల ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ మోటార్ సైకిల్ పై 11 సేఫ్టీ టెస్టింగ్స్ జరిగాయి. కంపెనీ దీనిని 7 రంగులలో విడుదల చేసింది.
Also Read : లీటరుకు అదిరిపోయే మైలేజీతో మార్కెట్లోకి కొత్త మారుతి ఆల్టో