https://oktelugu.com/

Citrione basalt : సేప్టీలో 4 స్టార్ పొందిన ఈ కారు.. లో బడ్జెట్ లోనే వస్తుంది.. ఇంతకీ ఏ కారో తెలుసా?

కార్లు కొనే వారు ఎక్కువగా ఎస్ యూవీ వైపు చూస్తుంటారు. ఎస్ యూవీ కూపేగా భారత మార్కెట్లో అడుగుపెట్టిన సిట్రియొన్ బసాల్ట్ కారును ఇటీవల ఆగస్టులో క్రాస్ట్ టెస్ట్ చేశారు. టాటా కర్వ్ కు పోటీగా వచ్చిన ఈ కారు సేప్టీలో 4 స్టార్ రేటింగ్ పొందింది. ఇందులో భాగంగా అడల్ట్స్ సేప్టీలో 32 పాయింట్లకు 26.19 పాయింట్లు సాధించింది.

Written By:
  • Srinivas
  • , Updated On : October 14, 2024 / 06:03 PM IST

    Citrione basalt

    Follow us on

    Citrione basalt : ఒక కారు కొనే ముందు అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయో లేవో చూస్తాం.. వీటిలో కొందరు ఫీచర్స్ చూస్తారు.. మరికొందరు మైలేజ్ చూస్తారు.. ఇంకొందరు తక్కువ ధరలో కారు కొనచ్చా? లేదా? అనేది చెక్ చేసుకుంటారు. అయితే ప్రతి ఒక్కరికీ కారు సేప్టీ చాలా ముఖ్యం. కారు ప్రయాణికులకు ఎంత మేరకు భద్రత ఇస్తుంది? దీనిని సేప్టీ రేటింగ్ ఎలా ఉంది? అని కొందరు ప్రత్యేకంగా తెలుసుకుంటారు. కొన్నికార్లు ధర కాస్త ఎక్కువగా ఉన్న సేప్టీ విషయంలో అత్యధిక రేటింగ్ ను పొందుతాయి. ఈ రేటింగ్ ను బట్టే కార్ల విక్రయాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. తాజాగా ఓ కారు సేప్టీ రేటింగ్ ను టెస్ట్ చేశారు. దీంతో ఇది 4 స్టార్ సాధించింది. ఇంతకీ ఆ కారు ఏదో తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ వివరాల్లోకి వెళ్లండి..

    కార్లు కొనే వారు ఎక్కువగా ఎస్ యూవీ వైపు చూస్తుంటారు. ఎస్ యూవీ కూపేగా భారత మార్కెట్లో అడుగుపెట్టిన సిట్రియొన్ బసాల్ట్ కారును ఇటీవల ఆగస్టులో క్రాస్ట్ టెస్ట్ చేశారు. టాటా కర్వ్ కు పోటీగా వచ్చిన ఈ కారు సేప్టీలో 4 స్టార్ రేటింగ్ పొందింది. ఇందులో భాగంగా అడల్ట్స్ సేప్టీలో 32 పాయింట్లకు 26.19 పాయింట్లు సాధించింది. అలాగే చిల్డ్రన్ సేప్టీ విషయంలో 49కి 35. 90 పాయింట్లు సాధించింది. సేప్టీతో పాటో ఆటోమేటిక్ , మాన్యువల్ గేర్ బాక్స్ లను కూడా పరీక్షించారు. ఇందులో భాగంగా ఫ్రంటల్ ఆప్ సెట్ డిఫార్మబుల్ బారియర్ టెస్ట్ లో 16 పాయింట్లకు 10 పాయింట్లు సాధించింది.

    మొత్తంగా సిట్రియొన్ బసాల్ట్ లో డ్రైవర్ తో పాటు ప్రయాణికులకు మంచి సేప్టీ ఉందని తేలింది. అయితే బూట్ స్పేస్ తక్కువగా ఉండడంతో కాళ్ల విషయంలో మాత్రం తగినంత రక్షణ ఉండేలా కనిపిండడం లేదు. అమయితే మూవింగ్ డిపార్మబుల్ టెస్ట్ లో 16కి 16 పాయింట్లు వచ్చాయి. సేప్టీ టెస్టింగ్ 4 స్టార్ సాధించడంలో ఈ కారులో సేప్టీ ఫీచర్స్ ను ఎక్కువగా అమర్చారు. ఇందులో 6 ఎయిర్ బ్యాగ్స్, సీటు బెల్ట్ రిమైండింగ్, సెన్సార్లతో కూడిని రియర్ పార్కింగ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ వంటివి ఉన్నాయి.

    సిట్రియొన్ బసాల్ట్ ప్రస్తుతం మార్కెట్లో రూ.8 లక్షలతో విక్రయిస్తున్నారు. టాప్ ఎండ్ వేరియంట్ రూ.13 లక్షలతో విక్రయిస్తున్నారు. ఇందులో 1.2లీటర్ పెట్రోల్ ఇంజిన్ ను ఉంది. ఇది 80 బీహెచ్ పీ పవర్, 115 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే 1.2 లీటర్ టర్బో ఇంజిన్ కూడా ఉంది. ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ తో పనిచేసే ఈ మోడల్ ను గత ఆగస్టులో లాంచ్ చేశారు. అయితే తొలి నెలలో 579 యూనిట్ల విక్రయాలు జరుపుకుంది. తాజాగా క్రాస్ టెస్టింగ్ లో సేప్టీ రేటింగ్ 4 స్టార్ సాధించడంతో మరిన్ని విక్రయాలు జరుపుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే ఆగస్టుతో పోలిస్తే సెప్టెంబర్ లో అమ్మకాలు తగ్గాయి.