Cheng Syfan: క్యాన్సర్ బారిన పడగానే చాలా మంది ఆవేదనతో కుమిలి పోతారు. మరణం అంచుల్లో ఉన్నామని బాధపడుతారు. కానీ క్యాన్సర్ లాస్ట్ స్టేజీకి వెళ్లి తిరిగి కోలుకున్న వారు చాలా మందే ఉన్నారు. అలా ఓ వ్యక్తి క్యాన్సర్ బారిన పడి తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. కానీ ఓ వైపు అతుడు చికిత్స తీసుకుంటూనే మరో వైపు ఓ లాటరీని కొనుగోలు చేశాడు. అంతే.. అతడికి జాక్ పాట్ తగిలింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ.10 వేల కోట్ల రూపాయలను గెలుచుకున్నాడు. ఆ వివరాల్లోకి వెళితే..
అమెరికాలోని లావోస్ కు చెందిన చెంగ్ సైపాన్ కు 46 ఏళ్ల వయసు. వీరు బతకడానికి కొన్నేళ్ల కిందట అమెరికాకు వచ్చారు. అయితే అయన ఎన్నో సంవత్సరాల నుంచే క్యాన్సర్ తో బాధపడుతున్నారు. తనకు అవస్థ ఎదుర్కొన్న సమయంలో కీమో థెరపీ చేయించుకున్నాడు. ఇలా ఇప్పటి వరకు 8 సార్లు కీమో థెరపీ చేయించుకున్నాడు. ఇదే సమయంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలన్న ఆలోచన పడింది. దీంతో అతడు పవర్ బాల్ లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. దీని విలువ 1.2 బిలియన్ డాలర్లు. ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ. 10 వేల 842 కోట్లు.
పవర్ బాల్ లాటరీ కి సంబంధించి ఇటీవల డ్రా నిర్వహించారు. ఈ డ్రాలో 22,27,44,52,69 నెంబర్లు వచ్చాయి. వీటితో చెంగ్ సైపాన్ ను కు చెందిన నెంబర్ సమానంగా ఉంది. దీంతో సైపాన్ ను లాటరీ విజేతగా ప్రకటించారు. ముందుగా ప్రకటించిన ప్రకరాం 1.3 బిలియన్ డాల్లలో ట్యాక్స్ కోసం 422 బిలియన్ డాలర్లు తగ్గిస్తారు. మిగిలిన మొత్తాన్ని చెల్లిస్తారు. ఈ లాటరీ తనకు దక్కడంతో ఎంతో సంతోషం వ్యక్తి చేసిన ఆయన ఈ డబ్బుతో చికిత్స చేయించుకుంటానని చెప్పాడు.