ఆగష్టు 1వ తేదీ నుంచి మారే అంశాలు ఇవే..?

ప్రతి నెలా 1వ తేదీన దేశ ఆర్థిక రంగ సేవలతో పాటు బ్యాంకింగ్ సేవల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటాయనే సంగతి తెలిసిందే. ఆగష్టు నెల 1వ తేదీ నుంచి బ్యాంక్ ఏటీఎం నుంచి క్యాష్ విత్ డ్రా ఛార్జీలు భారీగా పెరగనున్నాయి. ప్రముఖ బ్యాంకులలో ఒకటైన ఐసీఐసీఐ బ్యాంక్ నగదు లావాదేవీలపై ఛార్జీలను పెంచాయి. ఏటీఎం కేంద్రాల్లో ఇకపై ఒక్కో ఆర్థిక లావాదేవీ విషయంలో ఇంటర్ ఛేంజ్ ఫీజు 15 రూపాయల నుంచి 17 రూపాయల […]

Written By: Kusuma Aggunna, Updated On : July 31, 2021 5:04 pm
Follow us on


ప్రతి నెలా 1వ తేదీన దేశ ఆర్థిక రంగ సేవలతో పాటు బ్యాంకింగ్ సేవల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటాయనే సంగతి తెలిసిందే. ఆగష్టు నెల 1వ తేదీ నుంచి బ్యాంక్ ఏటీఎం నుంచి క్యాష్ విత్ డ్రా ఛార్జీలు భారీగా పెరగనున్నాయి. ప్రముఖ బ్యాంకులలో ఒకటైన ఐసీఐసీఐ బ్యాంక్ నగదు లావాదేవీలపై ఛార్జీలను పెంచాయి. ఏటీఎం కేంద్రాల్లో ఇకపై ఒక్కో ఆర్థిక లావాదేవీ విషయంలో ఇంటర్ ఛేంజ్ ఫీజు 15 రూపాయల నుంచి 17 రూపాయల వరకు పెరగగా ఆర్థికేతర లావాదేవీలపై ఛార్జీలు 5 రూపాయల నుంచి 6 రూపాయల కు పెరిగాయి.
2012 సంవత్సరం నుంచి బ్యాంకులు ఇంటర్ ఛేంజ్ ఫీజులను వసూలు చేస్తుండటం గమనార్హం. ఒక బ్యాంక్ కస్టమర్ మరో బ్యాంక్ ఏటీఎంలో లావాదేవీలు జరిపితే ఈ ఛార్జీలు అమలవుతాయి. ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ఆర్బీఐ ఛార్జీల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం. ఐసీఐసీఐ బ్యాంక్ నగదు డిపాజిట్, విత్ డ్రా విషయంలో నాలుగు ఉచిత లావాదేవీలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తుండటం గమనార్హం.

ఉచిత లావాదేవీల తర్వాత ప్రతి లావాదేవీకి 150 రూపాయల ఛార్జీలను ఐసీఐసీఐ బ్యాంక్ వసూలు చేయనుంది. మరోవైపు ఇకనుంచి సెలవు రోజుల్లో కూడా ఉద్యోగుల ఖాతాల్లో వేతనాలు, చెల్లింపులు, వడ్డీ, డివిడెండ్లు బ్యాంకులో జమవుతాయి. ఇకపై సెలవు రోజుల్లో కూడా ఈ.ఎం.ఐలు డెబిట్ కానుండటం గమనార్హం. ఐపీపీబీ డోర్ స్టెప్ సేవల ఛార్జీల కొరకు 20 ప్లస్ జీఎస్టీని వసూలు చేస్తుండటం గమనార్హం.

ప్రతి నెలా 1వ తేదీన గ్యాస్ ధరలు కూడా మారతాయి. కొన్నిసార్లు గ్యాస్ ధర స్థిరంగా ఉంటే కొన్నిసార్లు మాత్రం గ్యాస్ ధరలు పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. గ్యాస్ ధరలో మార్పు ఉంటుందో లేదో చూడాల్సి ఉంది.