https://oktelugu.com/

NPS: రూ.4,500తో నెలకు 51,000 రూపాయలు పొందే అవకాశం.. ఎలా అంటే?

NPS: మనం డబ్బులు సంపాదించే సమయంలోనే భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కొంత మొత్తం పొదుపు చేస్తే మంచిది. సంపాదించే సమయంలో పొదుపు చేయకపోతే ఇబ్బందులు తప్పవు. నేషనల్ పెన్షన్ సిస్టమ్ స్కీమ్ లో డబ్బులను ఇన్వెస్ట్ చేయడం ద్వారా పదవీ విరమణ తర్వాత ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడవచ్చు. 25 సంవత్సరాల వయస్సు నుంచే ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే నెలకు 50,000 రూపాయల కంటే ఎక్కువ మొత్తం పెన్షన్ పొందవచ్చు. 25 సంవత్సరాల […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 18, 2021 12:11 pm
    Follow us on

    NPS: మనం డబ్బులు సంపాదించే సమయంలోనే భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కొంత మొత్తం పొదుపు చేస్తే మంచిది. సంపాదించే సమయంలో పొదుపు చేయకపోతే ఇబ్బందులు తప్పవు. నేషనల్ పెన్షన్ సిస్టమ్ స్కీమ్ లో డబ్బులను ఇన్వెస్ట్ చేయడం ద్వారా పదవీ విరమణ తర్వాత ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడవచ్చు. 25 సంవత్సరాల వయస్సు నుంచే ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే నెలకు 50,000 రూపాయల కంటే ఎక్కువ మొత్తం పెన్షన్ పొందవచ్చు.

    NPS

    NPS

    25 సంవత్సరాల వయస్సులో నెలకు 4,500 రూపాయలను ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే 60 సంవత్సరాల వయస్సులో 10 శాతం వడ్డీతో 51,682 రూపాయలు పెన్షన్ గా పొందవచ్చు. ఈ స్కీమ్ లో ఎంత ఎక్కువ మొత్తం ఇన్వెస్ట్ చేస్తే అంత ఎక్కువ మొత్తం పెన్షన్ పొందవచ్చు. ఎన్‌పీఎస్‌లో రూ.4,500 ప్రతి నెలా పెట్టుబడి పెడితే 60 సంవత్సరాల వయస్సు వచ్చేనాటికి ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన మొత్తం 18.90 లక్షల రూపాయలు అవుతుంది.

    Also Read: ఈ-శ్రమ్ కార్డ్ ఉన్నవాళ్లకు శుభవార్త.. రూ.2 లక్షల బెనిఫిట్?

    ఈ మొత్తానికి 10 శాతం చక్రవడ్డీని లెక్కిస్తే 60 సంవత్సరాలకు కోటీ 72 లక్షల రూపాయలు అవుతుంది. ఈ మొత్తంలో 60 శాతం విత్ డ్రా చేసుకునే ఛాన్స్ ఉండగా 40 శాతానికి యాన్యుటీ ప్లాన్ ను కొనుగోలు చేస్తే మంచిది. 40 శాతం విత్ డ్రా చేస్తే 60 శాతానికి యాన్యుటీ ప్లాన్ ను కొనుగోలు చేయాలి. ఇలా చేస్తే నెలకు 51,682 రూపాయల పెన్షన్ ను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

    ఈక్విటీలు, కార్పొరేట్ బాండ్లు, ప్రభుత్వ సెక్యూరిటీలలో ఈ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేస్తారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని డబ్బులను ఇన్వెస్ట్ చేయాలని భావించే వాళ్లకు ఈ స్కీమ్ బెస్ట్ అని చెప్పవచ్చు.

    Also Read: ఏపీ పదో తరగతి విద్యార్థులకు అలర్ట్.. ఏడు పేపర్లు మాత్రమే?