Lic Dhan Rekha: దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నో కొత్త పాలసీలను అమలు చేస్తోంది. ఎల్ఐసీ అమలు చేస్తున్న పాలసీలలో ఎల్ఐసీ ధన్ రేఖ పాలసీ కూడా ఒకటనే సంగతి తెలిసిందే. ఎవరైతే ఈ పాలసీని తీసుకుంటారో వాళ్లు మెచ్యూరిటీ తర్వాత భారీ మొత్తం పొందే అవకాశంతో పాటు నిర్ణీత సమయాల్లో చేతికి ఎక్కువ మొత్తం డబ్బు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.
కనీసం 2 లక్షల రూపాయల నుంచి ఎంత మొత్తానికైనా ఈ పాలసీని తీసుకోవచ్చు. 20 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల టర్మ్ తో ఈ పాలసీని తీసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. మూడు నెలల వయస్సు నుంచి 55 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ పాలసీ తీసుకోవడానికి అర్హులు అనే సంగతి తెలిసిందే. ఎంచుకున్న టర్మ్ ను బట్టి ఈ పాలసీకి ప్రీమియంను చెల్లించాల్సి ఉంటుంది.
Also Read: నో బాల్ వేయని బౌలర్లు ఎవరో తెలుసా?
సింగిల్ ప్రీమియం ఆప్షన్ తో పాటు 20 ఏళ్ల టర్మ్, 30 ఏళ్ల టర్మ్, 40 ఏళ్ల టర్మ్ ను ఎంచుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. 20 ఏళ్ల టర్మ్ ఉంటే పది సంవత్సరాలు డబ్బులు చెల్లిస్తే సరిపోతుంది. ఈ పాలసీ తీసుకున్న మహిళలు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. పాలసీదారుడు మరణిస్తే నామినీ హెల్త్ బెనిఫిట్స్ ను పొందే ఛాన్స్ అయితే ఉంటుంది.
ఆన్ లైన్ లో లేదా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఏజెంట్ల ద్వారా ఈ పాలసీని కొనుగోలు చేసే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఎవరైతే ఈ పాలసీని తీసుకుంటారో వాళ్లు అత్యవసర సమయాల్లో లోన్ కూడా తీసుకోవచ్చు. 5 లక్షల రూపాయలకు పాలసీ తీసుకుంటే మెచ్యూరిటీకి ముందే లక్ష రూపాయలు మెచ్యూరిటీ సమయంలో 9 లక్షలు పొందవచ్చు. ఇందుకోసం పదేళ్లు నెలకు 4500 రూపాయల చొప్పున ప్రీమియం చెల్లించాలి.
Also Read: బంగార్రాజు కొడుకు అనిపించుకున్న నాగచైతన్య.. అందరి ముందే హీరోయిన్‌తో చిలిపి చేష్టలు..