PPF: రోజుకు రూ.400తో కోటి రూపాయలు పొందే అవకాశం.. ఏ విధంగా అంటే?

PPF: ప్రస్తుతం కేంద్రం అమలు చేస్తున్న స్కీమ్స్ లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ కూడా ఒకటని చెప్పవచ్చు. పన్ను మినహాయింపు, రిస్క్ లేకుండా మంచి రాబడిని పొందాలని భావించే వాళ్లకు పీపీఎఫ్ స్కీమ్ ద్వారా భారీ స్థాయిలో ప్రయోజనం చేకూరుతుంది. పీపీఎఫ్ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలంలో మంచి లాభాలను పొందవచ్చు. ప్రభుత్వ హామీ కలిగిన స్మాల్ సేవింగ్ స్కీమ్ కావడంతో ఈ స్కీమ్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఎవరైతే ఈ స్కీమ్ లో […]

Written By: Kusuma Aggunna, Updated On : January 7, 2022 8:59 am
Follow us on

PPF: ప్రస్తుతం కేంద్రం అమలు చేస్తున్న స్కీమ్స్ లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ కూడా ఒకటని చెప్పవచ్చు. పన్ను మినహాయింపు, రిస్క్ లేకుండా మంచి రాబడిని పొందాలని భావించే వాళ్లకు పీపీఎఫ్ స్కీమ్ ద్వారా భారీ స్థాయిలో ప్రయోజనం చేకూరుతుంది. పీపీఎఫ్ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలంలో మంచి లాభాలను పొందవచ్చు. ప్రభుత్వ హామీ కలిగిన స్మాల్ సేవింగ్ స్కీమ్ కావడంతో ఈ స్కీమ్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.

ఎవరైతే ఈ స్కీమ్ లో డబ్బులను ఇన్వెస్ట్ చేస్తారో వాళ్లకు పూర్తిస్థాయిలో పన్ను మినహాయింపు ప్రయోజనాలు లభిస్తాయి. మెచ్యూరిటీ సమయంలో తీసుకునే డబ్బుపై మాత్రం ఎలాంటి ట్యాక్స్ ను చెల్లించాల్సిన అవసరం అయితే ఉండదని చెప్పవచ్చు. రిస్క్ లేకుండా రాబడిని పొందాలని భావించే వాళ్లకు ఈ స్కీమ్ వల్ల ఎక్కువగా ప్రయోజనం చేకూరుతుంది. సంవత్సరానికి కనీసం 500 రూపాయల నుంచి లక్షన్నర రూపాయల వరకు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయవచ్చు.

ప్రస్తుతం ఈ స్కీమ్ పై 7.1 శాతం వడ్డీ అమలవుతుండటం గమనార్హం. పీపీఎఫ్ స్కీమ్ బెస్ట్ ట్యాక్స్ సేవింగ్ స్కీమ్స్‌లో ఒకటని చెప్పవచ్చు. సెక్షన్ 80సీ కింద ఈ స్కీమ్ లో చేరిన వాళ్లకు పన్ను మినహాయింపు బెనిఫిట్స్ లభిస్తాయి. కేంద్రం ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీరేట్లను సమీక్షించే అవకాశం ఉంటుంది. అయితే ఈ స్కీమ్ లో వడ్డీరేట్లు మారుతూ ఉంటాయి. రోజుకు 400 రూపాయల చొప్పున ఆదా చేసి నెలకు 12,000 రూపాయలు చెల్లిస్తే దీర్ఘకాలంలో మంచి రాబడిని పొందవచ్చు.

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ లో ఈ విధంగా 30 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేస్తే ఏకంగా కోటీ 54 లక్షల రూపాయలు పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ మొత్తంలో ఇన్వెస్ట్ చేసిన డబ్బులు 45 లక్షల రూపాయలు కాగా రాబడి కోటి రూపాయలకు అటూఇటుగా ఉంటుందని గుర్తుంచుకోవాలి.