Turmeric Farming: ప్రస్తుత కాలంలో రైతులు ఆహార పంటల కంటే వాణిజ్య పంటలకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. వాణిజ్య పంటలను సాగు చేయడం వల్ల మంచి లాభాలను సొంతం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. వ్యవసాయంలో కొత్త పద్ధతులు రైతులకు మంచి లాభాలను అందిస్తున్నాయి. ఆధునిక పద్ధతిలో సాగు చేయడం ద్వారా రైతులకు లాభాలు పెరుగుతాయి. ప్రస్తుత కాలంలో యువతలో చాలామంది ఆయుర్వేద మూలికలను పండించడం ద్వారా లాభాలను సొంతం చేసుకుంటున్నారు.
ఆయుర్వేదంలో పసుపుకు ఉండే ప్రాధాన్యత అంతాఇంతా కాదు. ఆయుర్వేదంలో ఉపయోగించే పసుపు సాగుతో లక్షల్లో సంపాదించవచ్చు. కేవలం 2 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా 14 లక్షల రూపాయల వరకు సంపాదించే అవకాశం ఉంటుంది. కేరళలోని కోజికోడ్ కోల్డ్ ఇండియన్ స్పైసెస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఈ కొత్తరకం పసుపును అందుబాటులోకి తెచ్చింది. ఎక్కువమొత్తంలో సంపాదించాలనుకునే రైతులు ఈ రకం పసుపును సాగు చేస్తే మంచిది.
ఏపీలోని విజయవాడ రైతులు సైతం ఈ పంటపై ప్రత్యేక దృష్టి పెట్టారు. మేడ్, ఖంచ పద్ధతిలో సాగు చేయడం ద్వారా మంచి లాభాలను సొంతం చేసుకుంటున్నారు. సరైన నీటి పారుదల సౌకర్యాలను ఏర్పాటు చేసుకుని తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సాగు చేస్తున్నారు. ఈ పద్ధతులను పాటిస్తూ కొత్తరకం పసుపును సాగు చేస్తే మంచి లాభాలు కచ్చితంగా సొంతమవుతాయని చెప్పవచ్చు.
కొత్తరకం పంటలను సాగు చేయడం ద్వారా రైతులకు మంచి లాభాలు సొంతమయ్యే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. రైతులు కొత్త తరహా పంటల సాగు దిశగా అడుగులు వేస్తే వ్యవసాయం ద్వారా కూడా సులువుగా సంపన్నులు కావచ్చు.