Chanakya Niti: ఆయన మనిషి జీవితానికి సంబంధించిన ఎన్నో గొప్ప విషయాలను తెలియజేశారు. నీ మనసు అంగీకరించకపోయినప్పటికీ కొన్ని విషయాలు మాత్రం పచ్చి నిజాలు అని ఆచార్య చానిక్యుడు తన నీతి శాస్త్రంలో తెలిపాడు. ఒక వ్యక్తి అస్సలు నిజాయితీగా ఉండకూడదు అని ఆచార్య చానిక్యుడు తన నీతి శాస్త్రంలో తెలిపాడు. ఎందుకంటే ముందుగా నిటారుగా ఉన్న చెట్లని నరికేస్తూ ఉంటారు అని ఆయన తెలిపాడు. ప్రతి ఒక్కరికి కూడా తమ కుటుంబం అంటే తమ కుటుంబం సభ్యులు అంటే చాలా ఇష్టం ఉంటుంది. కానీ ఆ కుటుంబ సభ్యులపై ఉన్న అతి ప్రేమ కూడా ఆ వ్యక్తికి నిరంతరం భయాన్ని మరియు దుఃఖాన్ని కలిగిస్తుంది అని ఆచార్య చాణిక్యుడు చెప్తున్నాడు. ఈ దేశంలో ఉన్న అతిపెద్ద శక్తి స్త్రీ యవ్వనం, అందం అని ఆచార్య చాణిక్యుడు చెప్తున్నాడు. దీనికి మించిన శక్తి ప్రపంచంలో మరొకటి లేదట. అలాగే ప్రతి ఒక్కరికి కూడా స్నేహితులు ఉంటారు. స్నేహానికి మించిన బంధం ఈ లోకంలో మరొకటి లేదు. కానీ ఆ స్నేహం వెనుక కూడా ఎంతో కొంత స్వార్థం దాగి ఉంటుంది అన్నది పచ్చి నిజం అని ఆచార్య చాణిక్యుడు అంటున్నాడు. అలాగే కొన్ని రకాల వ్యక్తులను జీవితంలో పరీక్షించకూడదు అని ఆచార్య చాణిక్యుడు సూచిస్తున్నాడు.
ముఖ్యంగా కష్టంలో ఉన్న బంధువులను, కష్టాలలో ఉన్న మిత్రులను, కర్తవ్యం లో ఉన్న సేవకుడిని అలాగే దురదృష్టంలో ఉన్న భార్యను పరీక్షించకూడదు అని ఆచార్య చాణిక్యుడు అంటున్నాడు. ప్రతి ఒక్కరు కూడా తమ జీవితంలో ఎన్నో ముఖ్యమైన పనులను ఎంతో ఆలోచించి చేస్తూ ఉంటారు. కానీ మీరు ఏదైనా ఒక ముఖ్యమైన పని మొదలుపెట్టేముందు తప్పకుండా మిమ్మల్ని మీరు మూడు ప్రశ్నలు వేసుకోవాలి అని ఆచార్య చాణుక్యుడు అంటున్నాడు. ఏదైనా పని చేసేటప్పుడు మిమ్మల్ని మీరే ఎందుకు, ఎందుకు కాదు, చేస్తే ఏం లాభం అనే మూడు ప్రశ్నలను వేసుకోవాలి. ప్రతి బంధం కూడా డబ్బుతోనే ముడిపడి ఉంటుంది అనేది పచ్చి నిజం అని ఆచార్య చానిక్యుడు చెప్తున్నాడు. డబ్బు ఉన్నచోట బంధుత్వాలు ఉంటాయి.
డబ్బుతోపాటు మనుషుల బంధాలు కూడా మారిపోతూ ఉంటాయి అంటూ ఆచార్య చాణిక్యుడు చెప్తున్నాడు. ఆచార్య చానిక్యుడు గొప్ప వ్యూహకర్త అనే విషయం అందరికీ తెలిసిందే. ఆయన తన నీతి శాస్త్రంలో మనుషులకు అవసరమైన ఎన్నో విషయాల గురించి అనేక సలహాలను సూచనలను అందించారు. ఇప్పటి కాలంలో ఉన్న ప్రజలకు కూడా అవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి అని చెప్పడంలో సందేహం లేదు.