Adhar Card: దేశంలోని ప్రజలలో దాదాపుగా అందరూ ఆధార్ కార్డును కలిగి ఉన్నారు. వేర్వేరు ప్రాంతాలకు బదిలీ అయినా లేక చిరునామా మారినా మనలో చాలామంది ఆధార్ కార్డ్ లో అడ్రస్ ను మార్చుకుంటూ ఉంటారు. అయితే ఆధార్ కార్డ్ లో అడ్రస్ మారినా డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, ఆర్.సీలలో కూడా అడ్రస్ ను మార్చుకోవాల్సి ఉంటుంది. అయితే యూఐడీఏఐ ఆధార్ లో అడ్రస్ మార్చుకున్న వాళ్లకు ప్రయోజనం చేకూరేలా కీలక నిర్ణయం తీసుకుంది.
మనలో చాలామంది ముఖ్యమైన పత్రాలను డిజిటల్ రూపంలో డిజీ లాకర్ ద్వారా భద్రపరుచుకుంటూ ఉంటారు. డిజీ లాకర్ లో ముఖ్యంగా డ్రైవింగ్ లైసెన్స్, ఆర్.సీ, పాన్ కార్డుతో పాటు ఇతర ధ్రువీకరణ పత్రాలను సైతం భద్రపరచుకోవడం జరుగుతుంది. అయితే యూఐడీఏఐ ఆధార్ కార్డ్ లో అడ్రస్ మారితే డిజీ లాకర్ లోని పత్రాలలో కూడా అడ్రస్ మారే విధంగా ప్రయత్నాలు చేస్తుంది. ఫలితంగా ఆధార్ లో మాత్రమే అడ్రస్ మార్చుకుంటే సరిపోతుందని చెప్పవచ్చు.
Also Read: Chiranjeevi: అందరం తిలకించి విజయవంతం చేద్దాం – చిరంజీవి
యూఐడీఏఐ ఇతర ప్రభుత్వ విభాగాల సహకారంతో ఈ నిర్ణయాన్ని అమలులోకి తెచ్చే దిశగా అడుగులు వేస్తోంది. యూఐడీఏఐ ఇప్పటికే కేంద్ర రోడ్డు, రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖతో ఇందుకు సంబంధించిన చర్చలను మొదలుపెట్టింది. ఆదాయపు పన్ను శాఖతో చర్చలు జరుపుతూ పాన్ కార్డుకు సంబంధించి అడ్రస్ మారే దిశగా యూఐడీఏఐ అడుగులు వేస్తుండటం గమనార్హం.
వేర్వేరు కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రజలకు ప్రయోజనం చేకూరే విధంగా యూఐడీఏఐ నిర్ణయాలు తీసుకుంటూ ఉండటం గమనార్హం. కొత్త పద్ధతి త్వరగా అందుబాటులోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు.
Also Read: బాలయ్య ఆ హీరోయిన్ ని లవ్ చేసారని తెలుసా ? ఎన్టీఆర్, హరి కృష్ణ ఒప్పుకోకపోవడం తో..!