Cell Tower: నేటి కాలంలో ప్రతి ఒక్కరూ మొబైల్ వాడుతున్నారు. కమ్యూనికేషన్ తో పాటు వివిధ అవసరాల నిమిత్తం మొబైల్ లేకుంటే రోజూ గడవని పరిస్థితి ఏర్పడింది. మొబైల్ యూజ్ వల్ల ఎంత లాభం ఉందో అంతే నష్టాలు కూడా ఉన్నాయి. అందువల్ల ఈ గాడ్జెట్ ను ఎంత జాగ్రత్తగా వాడుకుంటే అంత మంచిది అని చాలా మంది టెకీ నిపుణులు చెబుతున్నారు. అయినా జరిగే నష్టం జరుగుతోంది. తాజాగా కొందరు సైబర్ నేరగాళ్లు కొత్త తరహాలో మోసం చేయడానికి యత్నిస్తున్నారు.ఒక్క మెసేజ్ పంపి రూ.30 వేల వరకు దోచుకుంటున్నారు. అదెలాగో తెలుసుకోండి..
మొబైల్ అన్నాకా.. రోజూ వందల మెసేజ్ లు వస్తుంటాయి. అవన్నీ చూడ్డానికి ఎవరూ ఇంట్రస్ట్ పెట్టరు. కానీ ఎలాంటి కష్టం లేకుండా మీకు ఆదాయం వస్తుంది.. అనగానే దానిని క్లిక్ చేస్తారు. ఇలా ఇప్పటి వరకు ఒక్క క్లిక్ తోనే లక్షలు పోగొట్టుకున్నవాళ్లు ఉన్నారు. తాజాగా కొందరు ఎలాంటి కష్టం లేకుండా రూ. 50 వేలు సంపాదించొచ్చు అని నమ్మబలుకుతున్నారు. ఇందుకోసం సొంత ఇల్లు ఉంటే చాలు.. కాకపోతే కొంత పే చేయాల్సి ఉంటుందని అని అంటున్నారు.
పట్టణాల్లో ఇళ్లపై మొబైల్ నెట్ వర్క్ టవర్ ను ఏర్పాటు చేయడం ద్వారా ఓనర్ కు రెంట్ చెల్లించాల్సి ఉంటుంది. అయితే కొందరు కొత్తగా ఓ మెసేజ్ పంపి ‘మీ ఇంటిపై టవర్ ను ఏర్పాటు చేయాలనుకుంటున్నాం.. మీరు ఒప్పుకుంటే నెలకు రూ.50 వేల వరకు సంపాదించొచ్చు’ అని పంపిస్తున్నారు. ఈ మెసేజ్ కు ఆకర్షితులైన కొందరు అందులో ఉన్న నెంబర్ కు తిరిగి కాల్ చేస్తున్నారు. ఈ నెంబర్ ఉన్న వ్యక్తి ముందుగా తియ్యగా వినియోగదారుడిని ఆకర్షించేలా మాట్లాడుతారు.
అయితే టవర్ ఏర్పాటు చేయడానికి ముందుగా సొంతంగా డబ్బులు పెట్టాలని చెబుతారు. ఆ తరువాత నెలనెలా రూ.50 వేల అద్దె వస్తుందని చెబుతారు. ఎన్నో వ్యాపారాలకు పెట్టుబడులు పెడుతున్నాం.. ఇది కూడా అలాంటిదేనని కొందరు అవగాహన లేకుండా ఫోన్ చేసిన వ్యక్తి అడిగినంత ఇస్తున్నారు. ఇలా కొందరు ఒక్కోక్కరి దగ్గరి నుంచి రూ.30 వేలకు పైగా వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది.ముందు కొంత మొత్తం చెల్లిస్తే డాక్యుమెంట్ వెరిఫై చేస్తామని, ఆ తరువాత ఇంటిపై టవర్ ఏర్పాటు చేస్తామని చెప్పి దోచుకుంటున్నారు. అందువల్ల ఎవరైనా ఇలాంటి మెసేజ్ లకు ఆకర్షితులవ్వద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.