https://oktelugu.com/

Car Loan: ఈ ఫార్ములాతో కారు లోన్ తీసుకుంటే ఎలాంటి భారం ఉండదు..

ముందుగా 20 అంకెను తీసుకుంటే.. డౌన్ పేమెంట్ తక్కువ చెల్లించడానికి ఆస్కారం ఉన్నా.. 20 శాతం చెల్లించండి. ఉదాహరణకు రూ.10 లక్షల కారు ఉంటే కనీసం రూ.2 నుంచి రూ.3 లక్షలు చెల్లించేలా ప్లాన్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల మిగిలిని మొత్తానికి వడ్డీభారం తక్కువవుతంది.

Written By:
  • Srinivas
  • , Updated On : June 23, 2023 / 04:34 PM IST

    Car Loan

    Follow us on

    Car Loan: ఈరోజుల్లో ప్రతి ఒక్కరూ కారును కొనుగోలు చేస్తున్నారు. అవసరాలతో పాటు విహార యాత్రలకు ఈ వెహికల్ అనుగుణంగా ఉండడంతో పాటు ఫ్యామిలీ మొత్తం ప్రయాణించడానికి సౌకర్యంగా ఉంటుంది. అయితే చాలా మంది కారు కొనాలన్న ఉత్సాహంతో తమ వద్ద డబ్బు లేకపోయినా లోన్ ద్వారా కొనుగోలు చేస్తున్నారు. మినిమం డౌన్ పేమెంట్ తో లోన్ సౌకర్యం కల్పించి కార్లను విక్రయించే ఎన్నో కంపెనీలు ఉన్నాయి. అయితే వారు ఇస్తున్నారు గదా.. అని మనం తొందరపడొద్దు. మన బడ్జెట్ ను దృష్టిలో పెట్టుకొని లోన్ తీసుకోవాలి. అప్పుడే ఎలాంటి ఆర్థిక భారం పడదు. అయితే దానికో ఫార్మలా ఉంది. దాని ప్రకారంగా లోన్ తీసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.

    చాలా మంది లోన్ ద్వారా కారు కొనుగోలు చేయాలనుకునేవారు తక్కడ డౌన్ పేమేంట్ కడుతూ ఉంటారు. ఈఎంఐని ఎక్కువ పెట్టుకొని లాంగ్ టర్మ్ సెట్ చేసుకుంటారు. అయితే ఇలా చేయడం వల్ల దీర్ఘకాలికంగా అనేక ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. ఇలా చేస్తే కారు జీవిత కాలం ముగిసినా లోన్ తీరదు. దీంతో ఓ ఫార్ములాను ఉపయోగించాలంటున్నారు ఆర్థిక నిపుణులు. అదే 20-10-4. టైమింగ్ షీట్ లా ఉన్న ఈ నెంబర్ల ప్రకారంగా కారును కొనుగోలు చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవట. అదెలాగంటే..

    ముందుగా 20 అంకెను తీసుకుంటే.. డౌన్ పేమెంట్ తక్కువ చెల్లించడానికి ఆస్కారం ఉన్నా.. 20 శాతం చెల్లించండి. ఉదాహరణకు రూ.10 లక్షల కారు ఉంటే కనీసం రూ.2 నుంచి రూ.3 లక్షలు చెల్లించేలా ప్లాన్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల మిగిలిని మొత్తానికి వడ్డీభారం తక్కువవుతంది.

    10 అంకె విషయానికొస్తే.. మీరు ఏర్పాటు చేసుకొనే ఈఎంఐ మీకు వచ్చే ఆదాయంలో 10 శాతానికి మించి ఉండకూడదు. ఉదాహరణకు రూ.50 వేల జీతం ఉంటే అందులో నెలకు రూ.5వేలు వరకు మాత్రమే ఈఎంఐ సెట్ చేసుకోండి.ఎక్కువ మొత్తం పెట్టుకుంటే మిగతా అవసరాలకు డబ్బు సరిపోదు. దీంతో ఇబ్బందులుఏర్పడుతాయి.

    ఇక చివరిగా 4 అంకే అంటే.. ఈఎంఐ గడువు 4 సంవత్సరాలకు మించి ఉండకూడదు. ఎక్కువ నెలలు ఉండడం వల్ల అదనపు వడ్డీ ఉండడంతో పాటు లోన్ తీరలేదన్న మనస్థాపం ఉంటుంది. దీంతో మీరు కొనుగోలు చేసిన వస్తువు ప్రయోజనం పొందలేదు. అందువల్ల ఇలాంటి ప్లాన్ మీద కారు లోన్ తీసుకోండి. ఎలాంటి చిక్కుల్లో పడకుండా జాగ్రత్తగా ఉండండి..