Byd Seal : ఇండియా ఫ్యూచర్లో ఎలక్ట్రిక్ కార్ల మయంగా మారనుంది. అంతర్జాతీయంగా చమురు ధరల పెంపు.. వాతావరణ కాలుష్యంతో బయోడీజిల్, ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ)లను ప్రోత్సహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కొన్ని కంపెనీలు విద్యుత్ కార్లను ఒక్కొక్కటి అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఇప్పటికే హ్యుందాయ్, మారుతి లాంటి అగ్రశ్రేణి కంపెనీలు ఎలక్ట్రిక్ కార్లను పరిచయం చేశాయి. తాజాగా BYD SEAL అందుబాటులోకి వచ్చింది. దీని ఫీచర్స్ కేక.. అని కొందరు కారు వినియోగదారులు అభిప్రాయ పడుతున్నారు. దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..
BYD SEAL చూడ్డానికి స్టైలిష్ గా ఉంటుంది. అత్యంత వేగంగా ఛార్జింగ్ అవుతుంది. అలాగే మైలేజ్ విషయంలోనూ కాంప్రమైజ్ కాకుండా ఉంటుంది. దీని హ్యాండిల్, ఇన్నర్ డిజైన్ ఆకర్షిస్తుంది. BYD SEAL లో 230 బీహెచ్ పీ వపర్ , 360 ఎన్ ఎం టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఇందులో825 kWh బ్యాటరీని అమర్చారు. ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే 570 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. అలాగే ఇది 5.9 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. ఉండడం విశేషం.భద్రత విషయంలో ఈ కారుకు గ్లోబల్ మార్కెట్ లో 5 స్టార్ రేటింగ్ ఇచ్చారు.
సాధారణంగా 1 కిలో వాట్ ఛార్జర్ 8 గంటల్లో బ్యాటరీని పూర్తి చేయగలదు. కానీ BYD SEALలో 150kW వరకు వేగంగా ఛార్జింగ్ అయ్యే సామర్థం ఉంది. దీనికి ఫాస్ట్ ఛార్జర్ ను ఉపయోగించి కేవలం 37 నిమిషాల్లోనే 10 నుంచి 80 శాతం వరకు ఛార్జింగ్ అయ్యే అవకాశం ఉంది. 2,055 కిలోల బరువుతో ఉన్న ఈ మోడల్ పేటెంట్ బ్లెడ్ బ్యాటరీ టెక్నాలజీని కలిగి ఉండడం వల్ల దీనికి ఆ సౌకర్యం ఉంది. ఫాస్ట్ గా చార్జింగ్ కావడంలో ఈ మోడల్ ప్రత్యేకతను సంతరించుకుంది.
ఇక ఈ కారు డిజైన్ విషయానికొస్తే మొత్తం గ్లాసెస్ తో అమర్చారు. ఫ్లష్ ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్, విలక్షణమైన బూమారంగ్ ఆకారంపు ఎల్ ఈడీ 24 గంటల లైట్స్ ఆకర్షిస్తాయి. ఇన్నర్ డిజైన్ నూ ఇది ఆకర్షించేదిగా ఉంది. 15.6 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ తో 10.25 అంగుళాల డిజిటల్ ఇనుస్ట్రుమెంట్ క్లస్టర్, డ్రైవర్ కు అనుగుణంగా హెడెస్ ఆప్ డిస్ ప్లే ను అమర్చారు. హీటెడ్ విండ్ స్క్రీన్ కంట్రోల్ తో పాటు ఆడియో సిస్టమ్ ఆకర్షిస్తున్నాయి. దీనిని రూ.45.95 లక్షల ప్రారంభధరతో విక్రయించనున్నారు. వచ్చే మార్చిలో దీనిని అందుబాటులోకి తేనున్నారు.