Homeబిజినెస్Dream House in Italy: రూ.87కే కొత్త ఇల్లును సొంతం చేసుకునే అవకాశం.. ఎక్కడంటే..?

Dream House in Italy: రూ.87కే కొత్త ఇల్లును సొంతం చేసుకునే అవకాశం.. ఎక్కడంటే..?

Buying Dream House in Italy for one euroDream House in Italy: మనలో చాలామంది సొంతింటి కలను నెరవేర్చుకోవాలని భావిస్తూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకు పట్టణీకరణ పెరుగుతుండగా గ్రామాలు రోజురోజుకు ఖాళీ కావాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మారుమూల గ్రామాల్లో పుట్టినవాళ్లు సైతం పట్టణాల్లో స్థిరపడటానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇటలీ దేశంలో కూడా ఇదే పరిస్థితి నెలకొనగా ఫలితంగా పర్యాటకం దెబ్బ తింటుండటం గమనార్హం. గతంలో లోయలు, కొండల్లో ఉన్న గ్రామాల అందాలను చూడటానికి పర్యాటకులు అక్కడికి వెళ్లేవారు.

రోమ్ నగరంలో సమీపంలో ఉన్న గ్రామాలకు గతంలో ఎక్కువ సంఖ్యలో పర్యాటకులు వెళ్లేవారు. అయితే ప్రస్తుతం ప్రజలు నగరాలకు వెళుతున్న నేపథ్యంలో గ్రామాలు నిర్మానుష్యంగా మారుతుండటం గమనార్హం. గ్రామాలకు పునర్వైభవం రావడానికి ఇటలీ ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలను చేపడుతోంది. ప్రస్తుతం ఇటలీ సర్కార్ కేవలం ఒక్క యూరోకే ఇంటిని అందిస్తోంది.

వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఒక్క యూరోకే రోమ్ కు సమీపంలో ఉన్న మాయెంజా అనే పట్టణంలో ఇళ్లను అమ్మాలని నిర్ణయం తీసుకుంది. స్థానిక అధికారులు విడతల వారీగా ఇళ్లను విక్రయిస్తామని చెబుతున్నారు. ఈ నెల 28వ తేదీ నాటికి తొలి విడతలో భాగంగా దరఖాస్తుల స్వీకరణ ముగియనుండగా మధ్యయుగం నాటి నుంచి ఈ ప్రాంతం ఉందని రోమ్ కు దూరంగా ఉండే ఈ ప్రాంతానికి చారిత్రక ప్రాముఖ్యత కూడా ఉందని సమాచారం.

ఇళ్లు కొన్నవాళ్లు మూడేళల్లో ఇంటిని పునరుద్ధరించుకుంటామని చెబుతూ 5000 యూరోలు ముందస్తుగా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇల్లు కొన్నవాళ్లు ఖచ్చితంగా ఆ ఇంట్లో నివాసం ఉండాల్సిన అవసరం లేదు. అయితే స్థానిక ప్రభుత్వ యంత్రాంగానికి ఆ ఇంటిని ఏ విధంగా వినియోగించుకోబోతున్నారో మాత్రం తెలియజేయాలి.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper