Property Buying: మనలో చాలామంది సంపాదించిన డబ్బుతో ఇల్లు లేదా స్థలం కొనుగోలు చేయాలని అనుకుంటూ ఉంటారు. ఇల్లు లేదా స్థలం కొనుగోలు చేసే సమయంలో ఏ చిన్న తప్పు చేసినా జీవితాంతం ఇబ్బందులు పడాల్సి ఉంటుందని చెప్పవచ్చు. డాక్యుమెంట్లలో ఏవైనా పొరపాట్లు ఉన్నా ఇల్లు, స్థలానికి సంబంధించి ఏవైనా సమస్యలు ఉన్నా అలాంటి వాటిని కొనుగోలు చేయకుండా ఉంటే మంచిదని చెప్పవచ్చు.
ఇంటిని కొనుగోలు చేసేవాళ్లు కన్‌స్ట్రక్షన్ సర్టిఫికెట్ ను తప్పనిసరిగా పరిశీలించి కొనుగోలు చేయాలి. కన్‌స్ట్రక్షన్ క్లియరెన్స్ సర్టిఫికెట్ లేని ప్రాపర్టీలను కొనుగోలు చేస్తే మాత్రం రిస్క్ ఉంటుందని గుర్తుంచుకోవాలి. ప్రాపర్టీ లేదా ఇల్లు కొనుగోలు చేయాలంటే ఏవైనా రుణాలు లేదా పన్ను చెల్లించాల్సి ఉందేమో చెక్ చేసుకోవాలి. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ కు వెళ్లడం ద్వారా ఈ వివరాలను తెలుసుకునే ఛాన్స్ ఉంటుంది.
స్థలం లేదా ఇల్లు కొనుగోలు చేయాలంటే మొదట టైటిల్ డీడ్ ను చెక్ చేసుకోవాలి. టైటిల్ డీడ్ కరెక్ట్ గా ఉంటే ప్రాపర్టీ లావాదేవీల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురు కావు.