Business Tips: బంగారానికి రెక్కలు వచ్చేలా ఉన్నాయి. గత 10 రోజుల్లోనే తులం బంగారం వెయ్యి రూపాయలకు పైగా పెరిగింది. రూపాయి విలువ పడిపోవడం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, తక్కువ వడ్డీ రేట్లు వంటి కారణాలతో ఇన్వెస్టర్లు బంగారం వైపునకు మళ్లడంతో డిమాండ్ పెరుగుతోంది. కరోనా మహమ్మారి ఇలాగే కొనసాగితే రాబోయే ఏడాదిన్నరలో బంగారం ధర $2,000కు చేరే అవకాశం ఉన్నట్టు స్టాక్ మార్కెట్ నిపుణులు అంటున్నారు. మన లెక్కల్లో లక్షన్నర రూపాయల వరకు పలికే ఛాన్స్ ఉంది.
టాటా మోటర్స్ కి ఆటో మొబైల్ దిగ్గజం అనే ఘనమైన పేరు ఉంది. కాగా టాటా మోటర్స్ మరో వాహనంతో మార్కెట్లోకి వచ్చింది. ప్రీమియం ఎస్యూవీ రకానికి చెందిన సఫారీ డార్క్ ఎడిషన్ను విడుదల చేసింది. అత్యాధునిక ఫీచర్లతో రూపొందించిన ఈ కొత్త ఎస్‌యూవీ ప్రారంభ ధరను రూ.19.05 లక్షలుగా నిర్ణయించింది. ఈ సఫారీ ‘డార్క్’ ఎడిషన్ లుక్ కూడా అదిరిపోయింది.
Also Read: సమంత’కి షరతులు.. అవి చెత్త, నేను పట్టించుకోను – నాగార్జున
అలాగే ప్రీమియం మోటార్సైకిల్ సంస్థ కేటీఎం మరో కొత్త మోడల్ ను మార్కెట్లోకి రిలీజ్ చేసింది. ఎప్పటికప్పుడు ఆకట్టుకునే డిజైన్లతో కుర్రకారులో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ప్రీమియం మోటార్సైకిల్ సంస్థ ‘కేటీఎం 250 అడ్వెంచర్ బైక్ 2022 ఎడిషన్ ను అందుబాటులోకి తెచ్చింది. దేశవ్యాప్తంగా ఈ బైక్ కు బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. 248 సీసీ ఉన్న ఈ టూవీలర్ ధర రూ. 2.35 లక్షలుగా ఉంది. మొత్తమ్మీద కేటీఎం నుంచి వచ్చిన ఈ సరికొత్త ‘అడ్వెంచర్’ బైక్ అదిరింది.
Also Read: థర్టీ ప్లస్ లో విడాకులు… సమంత-చైతూలలో మొదట శుభవార్త చెప్పేదెవరు?