Homeబిజినెస్Business success tips for beginners: బిజినెస్ చేయాలనుకుంటున్నారా.. ఈ ట్రిక్స్ ఫాలో అయితే లాభాలే...

Business success tips for beginners: బిజినెస్ చేయాలనుకుంటున్నారా.. ఈ ట్రిక్స్ ఫాలో అయితే లాభాలే లాభాలు

Business success tips for beginners: బిజినెస్ అంటే కేవలం పెట్టుబడి మాత్రమే కాదు.. దిమాక్ ఉపయోగించి సాగించే వ్యవహారం. అందువల్లే వ్యాపారంలో చాలామంది విజయవంతం కాలేరు. మార్కెట్ అవసరాలు.. డిమాండ్.. సప్లై.. క్యాష్ ఫ్లోటింగ్.. ఇంకా రకరకాల వ్యవహారాల మీద పట్టుకుంటేనే బిజినెస్ అనేది లాభ సాటి అవుతుంది. లేకపోతే అంతే సంగతులు..

అప్పట్లో ధీరుబాయ్ అంబానీ ఆయిల్ రిఫైనరీ పెడితే చాలామంది నవ్వుకున్నారు. సరైన కనెక్టివిటీ లేని గుజరాత్ రాష్ట్రంలో రిఫైనరీ పెడుతున్నాడని ఎగతాళి చేశారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు అది ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ రిఫైనరీలలో ఒకటి. పైగా దానివల్ల గుజరాత్ రాష్ట్రానికి బీభత్సంగా ఆదాయం వస్తుంది. కొన్ని వేల కుటుంబాలకు అది ఒక కల్ప తరువు. పరోక్షంగా లక్షల కుటుంబాలకు ఆసరా..

సాధారణంగా బిజినెస్ మొదలు పెట్టేవాళ్ళు మార్కెట్ స్ట్రాటజీ కచ్చితంగా ఫాలో కావాలి. మార్కెట్ అవసరాలు తెలుసుకోవాలి. సప్లై పెంచుకోవాలి. డిమాండ్ కు తగ్గట్టుగా వస్తువులను రవాణా చేయాలి. అంతేతప్ప.. ఆడంబరంగా వ్యాపారం మొదలుపెట్టి.. తర్వాత నష్టాల పాలు కావొద్దు. ఉదాహరణకు ఒక ప్రభుత్వ కార్యాలయం వద్ద ఫోటోకాఫీ షాప్.. జిరాక్స్ షాప్ ఏర్పాటు చేస్తే.. లాభం ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వ కార్యాలయాలకు వివిధ పనుల మీద వచ్చేవారు కచ్చితంగా జిరాక్స్ లేదా ఫోటోలు తీసుకుంటారు. వివిధ రకాల దరఖాస్తులు కూడా అందుబాటులో ఉంచితే.. అప్పుడు లాభదాయకంగా ఉంటుంది.

ఇప్పుడు ప్రతి గుడి కూడా రద్దీగానే ఉంటోంది. అలాంటి ప్రాంతాలలో పూల దుకాణం పెడితే గిట్టుబాటు అవుతుంది. పూలతోపాటు కొబ్బరికాయలు.. ఇతర పూజ సామగ్రి గనక విక్రయించడం మొదలుపెడితే.. వ్యాపారం లాభసాటిగా సాగుతూ ఉంటుంది. పైగా పూల వ్యాపారంలో అంతగా నష్టాలు ఉండవు. పూజా సామగ్రి అమ్మకంలో కూడా పెద్దగా ఇబ్బందులు ఉండవు. హైవే రోడ్ల పక్కన బైక్ రిపేర్ షాప్ పెడితే.. లాభాలే లాభాలు.. ఎందుకంటే హైవేల పక్కన పెద్దగా షాపులు ఉండవు. ఏవైనా వాహనాలకు మరమ్మతులు ఏర్పడితే.. అప్పటికప్పుడు ఎక్కడ ఉన్న రిపేర్ షాప్ దగ్గరికి వెళ్లాలంటే ఇబ్బందిగా ఉంటుంది. అందువల్లే హైవేల పక్కన బైక్ రిపేర్ షాప్ లు పెడితే లాభదాయకంగా ఉంటుంది.. వాటికి అనుసంధానంగా EV చార్జింగ్ పాయింట్ ఏర్పాటు చేస్తే ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు.

బస్టాండ్ ఏరియాలలో టీ, స్నాక్స్ అమ్మే స్టాల్ ఏర్పాటు చేస్తే ఎంతో లాభం ఉంటుంది. ఇలాంటి బిజినెస్ ట్రిక్ ప్లే చేసింది కాబట్టే పారడైజ్ ఈరోజు నెంబర్ వన్ రెస్టారెంట్ గా ఉంది. ఇప్పటికీ హైదరాబాద్ లోని ఎంజీబీఎస్, ఇమ్లిబన్, సికింద్రాబాద్ వంటి ఏరియాలలో ప్యారడైజ్ టీ, స్నాక్ స్టాల్స్ ఉన్నాయి. అందులో బిర్యాని కూడా అమ్ముతుంటారు. ఇక కాలేజీ ఏరియాలలో లాండ్రీ సర్వీస్ ఏర్పాటు చేస్తే.. గిట్టుబాటు అవుతూ ఉంటుంది.

పెద్దపెద్ద అపార్ట్మెంట్లు ఉన్న ఏరియాలలో ఇస్త్రి షాప్ పెడితే కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. హైదరాబాదులోని మాదాపూర్ ఏరియాలో ఒక వ్యక్తి ఇస్త్రీ షాప్ పెట్టి.. రోజుకు 5000 వరకు సంపాదిస్తున్నాడు. తన ఆదాయం గురించి సోషల్ మీడియాలో అతడు పోస్ట్ పెడితే.. లక్షలలో వీక్షణలు వచ్చాయి. జిమ్ సెంటర్ లు ఉన్న ఏరియాలలో జ్యూస్, హెల్దీ డైట్ వంటి షాపులు పెడితే.. లాభ సాటిగా ఉంటుంది. పైగా చాలామందికి ఈ రోజుల్లో ఆరోగ్య మీద శ్రద్ధ పెరిగిపోయింది. అందువల్లే పండ్ల రసాలు.. జావాలు.. ఫ్రూట్ సలాడ్ లు తింటున్నారు.

ఇవన్నీ కేవలం ఉదాహరణలు మాత్రమే. చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఒక వ్యాపారంలో భారీగా పెట్టుబడి పెట్టే బదులు.. ముందుగా అక్కడి స్థానిక పరిస్థితులను ఆకలింపు చేసుకోవాలి. ఆ తర్వాత అక్కడి ప్రజల అవసరాలు.. సరుకులు తీసుకొచ్చే విధానం.. డెలివరీ చేసే విధానంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. అప్పుడే వ్యాపారం లోకి దిగాలి. అది ఎంతైనా సరే ముందుగా దిగిన తర్వాత మార్కెట్ వ్యాల్యూ పెంచుకోవాలి. అదిగో అప్పుడే వ్యాపారంలో నిలదొక్కుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version