Business Idea: కేవలం రెండు నుంచి మూడు లక్షల రూపాయలతో ఇంటీరియర్ డిజైనింగ్ వ్యాపారాన్ని మీరు ప్రారంభించవచ్చు. ఈ మధ్యకాలంలో ఇంటీరియర్ డిజైనింగ్ మార్కెట్లో చాలా ప్రాచుర్యం పొందింది. ప్రతి ఒక్కరు కూడా తమ ఇల్లు లేదా కార్యాలయాన్ని చాలా అందంగా అలంకరించుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలో ఫర్నిచర్ మరియు ఇంటీరియర్ డిజైన్ ప్రకారం వాళ్లు తమ కార్యాలయాన్ని కానీ లేదా ఇళ్లను కానీ అందంగా అలంకరించడానికి చూస్తుంటారు. ముఖ్యంగా ఇంటీరియర్ డిజైనింగ్ వ్యాపారం యువతకు చాలా మంచి వ్యాపారం అని చెప్పడంలో సందేహం లేదు. ముఖ్యంగా ఇళ్లలో, కార్యాలయాలలో లేదా హోటల్లలో ఇంటీరియర్ డిజైనింగ్ చాలా అవసరం ఉంటుంది. ఈ మధ్యకాలంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో కూడా ఈ ట్రెండ్ మొదలైంది. దీనిని మీరు ఒక వ్యాపారంగా మొదలు పెట్టవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో చాలా డిమాండ్ ఉన్న వ్యాపారాలలో ఇంటీరియర్ డిజైనింగ్ కూడా ఒకటి.
Also Read: క్రెటా కింగ్ మేకర్ అవ్వడానికి కారణం ఈ 5 ఫీచర్లే
ఇంటీరియర్ డిజైనింగ్ వ్యాపారాన్ని మీరు తక్కువ ఖర్చుతో మొదలుపెట్టి మొదటి నెల నుంచి సంపాదన పొందవచ్చు. ఈ క్రమంలో మీరు కస్టమర్లను ఆకట్టుకోవడానికి వివిధ రకాలైన క్యాటలాగ్ ను రూపొందించుకోవాలి. మీరు రూపొందించిన మీ డిజైన్ ద్వారా మీరు కస్టమర్లను ఆకట్టుకోవచ్చు. ఇంటీరియర్ డిజైనింగ్ మీ ఇల్లు, కార్యాలయానికి లేదా హోటల్ కు చాలా అద్భుతమైన మరియు విలాసవంతమైన రూపాన్ని అందిస్తుంది. కానీ మీరు ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టే ముందు సరైన ఫీల్డ్ వర్క్ చేయడం కూడా చాలా అవసరం అని చెప్పాలి. ఈ మధ్యకాలంలో ఇంటీరియర్ డిజైనింగ్ వ్యాపారంలో బాగా గుర్తింపు పొందిన రెహాన్ మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో మార్కెట్లో అత్యధిక డిమాండ్ ఉన్న వ్యాపారాలలో ఇంటీరియర్ డిజైనింగ్ వ్యాపారం కూడా ఒకటి. చాలా తక్కువ ఖర్చుతో ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టవచ్చు.
దీనికి కేవలం మీకు అద్భుతమైన డిజైన్తో పాటు దానికి అవసరం అయినా ముడి పదార్థాలు కావాలి. ఈ ముడి పదార్థాల కోసం మీరు ఢిల్లీ లేదా ముంబైలో ఉన్న హోల్సేల్ మార్కెట్ల నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇంటి ఏరియా డిజైనింగ్ లో పివిపి ప్యానెల్ లను వినియోగిస్తారు. ఇందులో చాలా రకాల వెరైటీలు ఉంటాయి. అలాగే మీరు ఈ వ్యాపారాన్ని మొదలుపెట్టేముందు మార్కెట్లోని కస్టమర్ పరిధి ఏంటో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇంటిరియర్ డిజైనింగ్ గురించి మాట్లాడుతూ రెహాన్ ప్రారంభంలో మార్కెట్లో మనం తక్కువ ఖర్చుతో ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టవచ్చు. కొన్ని బ్రాండ్లతో కూడా దీని కోసం మీరు సంప్రదించవచ్చు. లేకపోతే స్వయంగా కొన్ని విడి భాగాలను కొని దీనిని మొదలు పెట్టవచ్చు. ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా ఇంటీరియర్ డిజైనింగ్ లో వాల్ పెయింటింగ్ బదులుగా వాల్ పేపర్ ప్రాచుర్యం పొందింది.