https://oktelugu.com/

Home Loan : ఇల్లు కట్టుకునేవారికి బంపర్ ఆఫర్.. రూ.2,67,000 ఫ్రీ.. ఎలాగో తెలుసుకోండి..

కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కొన్ని గైడ్ లైన్స్ ఫాలో కావాలి. అంతేకాకుండా కొందరు మాత్రమే దీనికి అర్హులుగా ఉంటారు. నిజమైన లబ్ధిదారులు అని తేలితే వారికి రూ.2,67,000లను కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తుంది.

Written By:
  • Srinivas
  • , Updated On : March 2, 2024 / 10:53 AM IST

    Home construction

    Follow us on

    ఇల్లు కట్టుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. కానీ చాలా మంది లోన్ ద్వారానే ఇల్లు నిర్మించుకుంటున్నారు. లోన్ ద్వారా ఇల్లు కట్టుకునేవారికి కేంద్ర ప్రభుత్వం చక్కని సదుపాయం కల్పించింది. కొత్త ఇల్లు నిర్మించుకునేవారికి రూ.2,67,000 లను ఉచితంగా ఇస్తుంది. వీటిని తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కొన్ని గైడ్ లైన్స్ ఫాలో కావాలి. అంతేకాకుండా కొందరు మాత్రమే దీనికి అర్హులుగా ఉంటారు. నిజమైన లబ్ధిదారులు అని తేలితే వారికి రూ.2,67,000లను కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తుంది. మరి దీని వివరాల్లోకి వెళితే..

    2015 జనవరి 25న కేంద్ర ప్రభుత్వం ‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన’ అనే పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా మధ్యతరగతి ప్రజలకు ఇంటి నిర్మాణం సాయం చేస్తుంది. ఇల్లు కట్టుకోవాలనుకునేవారు బ్యాంకు నుంచి రుణం తీసుకున్నవారైతే.. వారికి ఈ సాయం అందుతుంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ.2,67,000 మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల చేతికి ఇవ్వదు. ఈ మొత్తాన్ని రుణం తీసుకున్న బ్యాంకుకు చెల్లిస్తుంది. అంటే లబ్ధిదారుడు ఏ బ్యాంకు నుంచి లోన్ తీసుకున్నారో.. ఆ బ్యాంకుకు చెల్లించడం ద్వారా ఆ మొత్తం రుణం నుంచి మాఫీ అవుతుంది.

    ఈ పథకానికి అర్హత సాధించాలంటే కొన్ని అర్హతలుండాలి. ముందుగా వార్షిక ఆదాయం 3 నుంచి 6 లక్షల లోపు ఉండాలి. ఈ ఆదాయం పొందుతున్న వారికి మొత్తం అంటే రూ.2,67,000 మాఫీ అవుతుంది. అలాగే 6 లక్షల నుంచి 12 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి కూడా ఈ పథకం వర్తిస్తుంది. అయితే వీరికి రూ.2.35 లక్షలు వస్తాయి. అంతకంటే ఎక్కువ ఆదాయం ఉన్న వారికి మాత్రం ఈ పథకం వర్తించదు. అందువల్ల పై ఆదాయం కంటే తక్కువ ఉన్నవారికి ఇది వర్తిస్తుంది.

    హోమ్ లోన్ కు అప్లై చేసుకున్నప్పుడే ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వెరిఫై చేసిన తరువాత అర్హులను గుర్తిస్తారు. ఆ తరువాత అన్నీ ఓకే అయితే ఇల్లు నిర్మాణ మధ్యలోనే ఆ మొత్తం బ్యాంకులో జమ అయి రుణభారం తగ్గుతుంది. మొత్తంగా లోన్ ద్వారా ఇల్లు కట్టుకోవాలనుకునేవారికి ఇది మంచి అవకాశం. అందువల్ల ఈ పథకం లబ్ధి పొందాలంటే వెంటనే అప్లై చేసుకోండి..