Best Sales Car: దేశంలోని కార్ల ఉత్పత్తిలో మారుతి అగ్రస్థానంలో ఉంటుంది. మార్కెట్లోకి ఎన్ని కంపెనీలు వచ్చినా మారుతి కార్లకు ఉన్న క్రేజ్ తగ్గదు. హ్యాచ్ బ్యాక్ నుంచి ఎస్ యూవీ వరకు వివిధ వేరియంట్లను అందుబాటులో ఉంచుతున్న ఈ కంపెనీకి చెందిన కొన్ని కార్లు దశాబ్దాలుగా అమ్ముడుపోతూనే ఉన్నాయి. వీటిలో వ్యాగన్ ఆర్, స్విప్ట్ ప్రముఖంగా ఉన్నాయి. అయితే ఇటీవల వ్యాగన్ ఆర్ కంటే స్విప్ట్ అమ్మకాల్లో రారాజుగా నిలిచింది. గతంలో ఉన్న స్విప్ట్ ను అప్డేట్ చేసి గత నెలలో మార్కెట్లోకి తీసుకొచ్చారు. విడుదలయిన ఒక్క నెలలోనే ఈ కారు అమ్మకాల్లో జోరందుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఆటోమోబైల్ మార్కెట్లో ఎన్నో కార్లు ఉన్నా మారుతి కార్ల మధ్యే పోటీ ఎక్కువగా ఉంటుంది. మారుతి కంపెనీకి చెందిన వ్యాగన్ ఆర్ ఎవర్ గ్రీన్ గా నిలుస్తూ ఉంటుంది. అన్ని వర్గాలను ఆకర్షించే విధంగా ఉన్నఈ కారు దశాబ్దాలుగా రారాజుగా నిలుస్తోంది. అయితే దీనిని అధిగమించడానికి వేరే కంపెనీ కారు కాకుండా సొంత కంపెనీలోని స్విప్ట్ తీవ్రంగా పోటీ పడుతుంది. ఈ నేపథ్యంలో గత నెలలో అమ్మకాలు చూస్తే వ్యాగన్ ఆర్ కంటే స్విప్ట్ అధిగమించింది.
పాత స్విప్ట్ ను అప్డేట్ చేస్తూ కొత్త మారుతిని మే నెల 9న మార్కెట్లోకి తీసుకొచ్చారు. సహజంగానే స్విప్ట్ కు ఆదరణ ఎక్కువగా ఉంది. ఇక కొత్త స్విప్ట్ మార్కెట్లోకి రాగానే అమ్మకాలు జోరందుకున్నాయి. మేనెలలో ఈ కారు 19,339 యూనిట్లను విక్రయించింది. ఇదే సమయంలో మారుతికి చెందిన వ్యాగన్ ఆర్ 17,850 యూనిట్లు అమ్మారు. అంటే కొత్త తరం స్విప్ట్ సైతం మిగతా కార్లకు గట్టి పోటీ ఇస్తోంది. అందులోనూ సొంత కంపెనీకి చెందిన వ్యాగన్ ఆర్ నే అధిగమిస్తోంది.
కొత్త స్విప్ట్ ఇంజిన్ విషయానికొస్తే. 1.2 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉంది. ఈ మోడల్ 82 బీహెచ్ పీ పవర్ తో పాటు 112 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు మాన్యువల్ గేర్ బాక్స్ లో లీటర్ పెట్రోల్ కు 24.8 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఆటోమేటిక్ గేర్ బాక్స్ లో 25.75 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కారును వాడేవారు తెలుపుతున్నారు. ఇందులో డిజిటల్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ ఏసీ వంటీ ఫీచర్లతో పాటు 6 ఎయిర్ బ్యాగ్స్, పార్కంగ్ సెన్సార్ వంటి సేప్టీ ఫీచర్లు ఉన్నాయి.
Chai Muchhata is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Read More