భారత్ లో కార్ల వినియోగం రోజురోజుకు పెరిగిపోతుంది. దీంతో ఒకప్పుడు ధనికులు మాత్రమే సొంతం చేసుకున్న కార్లు ఇప్పుడు అన్ని వర్గాల వారు కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా మిడిల్ క్లాస్ పీపుల్స్ కార్ల ను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. మిడిల్ క్లాస్ లో ఉండే చిన్న ఫ్యామిలీకి అనుగుణంగా ఉండే ఓ కారు మార్కెట్లోకి ఇప్పటికే రిలీజ్ అయింది. అయితే ఇటీవల ఈ కారు కోసం ఎగబడుతున్నారు. ఇందులో ఉండే ఫీచర్స్ తో పాటు ఎక్కువ మైలేజ్ ఇవ్వడంతో చాలా మంది దీనిని కోరుకుంటున్నారు. ఇంతకీ ఇది ఏ కారు? ఈ కారు వివరాలేంటి?
దేశంలోని కార్ల ఉత్పత్తిలో అగ్రగామిగా ఉండే సంస్థల్లో హ్యుందాయ్ ఒకటి. ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయిన ఎక్స్ టర్ అన్ని వర్గాల పీపుల్స్ ను ఆకట్టుకుటోంది. ముఖ్యంగా SUV సెగ్మెంట్ లో కారు కొనాలనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని అంటున్నారు. చిన్న ఫ్యామిలీ కారు కొనుగోలు చేయాలనుకుంటే ఇది బెస్ట్ వెహికల్ అని మైలేజ్ కూడా 27 కిలోమీటర్ల వరకు దూసుకెళ్తుందని ఇప్పటికే కొనుగోలు చేసిన వారు చెబుతున్నారు.
హ్యుందాయ్ ఎక్స్ టర్ 1.2 లీటర్ 4 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ తో పనిచేయనుంది. ఇందులో 81.8 బీహెచ్ పీ పవర్ తో పాటు 113.8 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్ తో పాటు సీఎన్ జీ వెర్షన్ లో లభించే ఇది ఆ వేరియంట్ లో 67,7 బీహెచ్ పీ పవర్, 95.2 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇక ఫీచర్ విషయానికొస్తే ఇందులో ఆటోమేటిక్ గేర్ బాక్స్ అలరిస్తుంది. అలాగే 15 అంగుళాల డైమంట్ కట్ వీల్స్, షార్క్ ఫిన్ యాంటైనా డిజైన్ ఆకర్షిస్తాయి.
ఎస్ యూవీ కార్లలో ఎక్స్ టర్ డిఫరెంట్ లుక్ తో కనిపిస్తుంది. స్పిట్ హెడ్ లైట్ సెటప్, పారామెట్రిక్ గ్రిల్స్, ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. గ్రిల్ కు ఇరువైపులా ప్రొజెక్టర్ హెడ్ ల్యాంపులు ఉంటాయి. ఎక్స్ టర్ ధర విషయానికొస్తే రూ.6 లక్షల నుంచి రూ.10.10 లక్షల వరకు విక్రయిస్తున్నారు. ఫ్యామిలీతో లాంగ్ డ్రైవ్ చేయాలనుకునేవారికి ఇది మంచి సౌకర్యవంతంగా ఉండనుంది.