https://oktelugu.com/

Best Car: ఈ కారు కోసం 13 వారాలు ఆగాలి.. అంత డిమాండ్ ఎందుకు?

ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ తో పాటు 119 సీసీ ఇంజిన్ ను కలిగి ఉంది. గంటకు 20 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే ఈ కారు సీఎన్ జీలో 26 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.

Written By:
  • Srinivas
  • , Updated On : March 11, 2024 / 10:09 AM IST

    tata tiyago

    Follow us on

    Best Car:కారు కొనుగోలు చేయాలని ఈ మధ్య చాలా మంది కోరుకుంటున్నారు. కొన్ని ప్రత్యేక ప్రయాణాలు చేయడానికి సొంత వెహికల్ ఉండాలని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మంచి కారు కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఇటీవల ఓ కారకు విపరీమైన డిమాండ్ ఏర్పడింది. అది దక్కాలంటే 13 వారాలు ఆగాల్సిందేనట. అయినా వీటి కోసం బుకింగ్ చేసుకుంటూనే ఉన్నారు. తక్కువ బడ్జెట్ లో మంచి ఫీచర్స్ అందించే ఈ కారు గురించి తెలుసుకోవాలని ఉందా..?

    దేశంలో కార్ల ఉత్పత్తిలో అగ్రగామిగా నిలిదేది ఎవరంటే ముందుగా మారుతి సుజుకీ పేరు చెబుతాం. కానీ ఈ కంపెనీకి టాటా గట్టి పోటీ ఇస్తోంది. దీని నుంచి ఇప్పటికే వివిధ మోడళ్లు మార్కెట్లోకి వచ్చి అలరించాయి. అయితే ఇప్పటికే వచ్చిన ‘టియాగో’ కొత్త ఫీచర్స్ తో మార్కెట్లోకి రాబోతుంది. నేటి వినియోగదారులను ఆకర్షించే విధంగా ఇంజిన్ తో పాటు ఆకర్షించే డిజైన్ ను మార్చారు. ఈ కారు ఇప్పుడున్న వాటికి కొత్త సవాళ్లు విసురుతుందని కంపెనీ ప్రతినిధులు అంటున్నారు.

    టాటా టియాగో కొత్త కారు ఇప్పటికే సేప్టీ విషయంలో గ్లోబల్ మార్కెట్ లో 4 స్టార్ రేటింగ్ పొందింది. ఇందులో పెట్రోల్ తో పాటు సీఎన్ జీ వేరియంట్ కూడా అందుబాటులో ఉంది. ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ తో పాటు 119 సీసీ ఇంజిన్ ను కలిగి ఉంది. గంటకు 20 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే ఈ కారు సీఎన్ జీలో 26 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. రూ.6 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. టాప్ ఎండింగ్ రూ.8 లక్షలు అవుతుంది.

    అయితే లేటేస్ట్ ఫీచర్స్ తో కొత్త డిజైన్ తో అలరిస్తున్న ఈ కారును పొందాలంటే 13 వారాలు ఆగాల్సిందేనని తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో హ్యాచ్ బ్యాక్ కార్లలో టియాగో ది బెస్ట్ గా నిలుస్తోంది. అంతేకాకుండా 5 గురు ప్రయాణికులు సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు అనుగుణంగా ఉండడంతో కొందరు దీనిపై మక్కువ చూపుతున్నారు. అయితే ఈ త్రైమాసికంలో ఈ మోడల్ ఏ రేంజ్ లో అమ్మకాలు జరుపుకుంటుందో చూడాలి.