Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం ఎంతో ప్రమాదకరం. నీరు సైలెన్సర్ లేదా ఇంజిన్లోకి చేరి కారు మధ్యలోనే ఆగిపోయే ప్రమాదం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ (Ground Clearance) కలిగిన కార్లు వర్షపు నీటిని సులభంగా దాటుకుంటూ ముందుకు సాగుతాయి. అలాంటివి మార్కెట్లో టాప్ ప్లేసులో కొన్ని ఉన్నాయి. ఇవి తక్కువ బడ్జెట్ కావడం విశేషం. ఆ కార్లు ఏవంటే?
నిస్సాన్ మాగ్నెట్ (Nissan Magnite):
నిస్సాన్ మాగ్నెట్ గ్రౌండ్ క్లియరెన్స్ 205 mm గా ఉంటుంది. దీంతో వర్షపు నీరు ఎక్కువగా నిలిచిన రోడ్లపై కూడా కారు అడుగుభాగం తగలకుండా సునాయాసంగా వెళ్లడానికి ఇది దోహదపడుతుంది. దీనికి తోడు కారు కమాండింగ్ సీటింగ్ పొజిషన్ డ్రైవర్‌కు నీటి లోతును సరిగ్గా అంచనా వేయడానికి సహాయపడుతుంది. కఠినమైన వాతావరణంలోనూ ట్రాక్షన్ నిలబెట్టే వెహికల్ డైనమిక్స్ దీని సొంతం. దీని ధర రూ.6 లక్షలుగా ఉంది.
రెనో కైగర్ (Renault Kiger):
మాగ్నెట్‌తో సమానంగా రెనో కైగర్ గురించి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో కూడా 205 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. గుంతలు, నీటి అడ్డంకులను తేలికగా దాటుతుంది. కైగర్ స్పోర్టీ డిజైన్ తో పాటు అండర్బాడీ క్లియరెన్స్ వల్ల నీరు ఇంజిన్ భాగాల వరకు చేరకుండా రక్షణ లభిస్తుంది. అంతేకాకుండా, ఇందులో ఉండే డ్రైవింగ్ మోడ్లు వర్షపు తడి రోడ్లపై మెరుగైన గ్రిప్‌ను అందించడంలో ఉపయోగపడతాయి. ఇది కూడా రూ.6 లక్షలుగా ఉంది.
టాటా పంచ్ (Tata Punch):
మజిక్యులర్ బిల్డ్ క్వాలిటీ, 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌తో వచ్చే టాటా పంచ్ వర్షాకాలంలో అత్యంత నమ్మకమైన కారుగా పేర్కొంటారు. ఇందులో 187 mm గ్రౌండ్ క్లియరెన్స్ మాత్రమే కాకుండా, దీని ప్రవేశ, నిష్క్రమణ కోణాలు మెరుగ్గా ఉంటాయి. ముఖ్యంగా టాటా పంచ్ లో 370 mm వరకు వాటర్ వేడింగ్ కెపాసిటీ పొందింది అంటే సుమారు అడుగున్నర లోతు నీటిలో కూడా ఇంజిన్ ఆగిపోకుండా నడిచే సామర్థ్యం దీనికి ఉంది. ఈ కారును రూ. 6.13 లక్షలతో విక్రయిస్తున్నారు.
హ్యుందాయ్ ఎక్స్టర్ (Hyundai Exter):
హ్యుందాయ్ ఎక్స్టర్ 185 mm గ్రౌండ్ క్లియరెన్స్ తో సరసమైన ధరలో మైక్రో SUV లవర్స్‌కు మంచి ఎంపిక. బాక్స్ తరహా నిర్మాణం, ఎత్తైన సీటింగ్ పొజిషన్ వల్ల వర్షంలో రోడ్డు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రమాదకరమైన రోడ్లపై వాహనం అదుపు తప్పకుండా ఉండేందుకు ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ , హిల్ స్టార్ట్ అసిస్ట్ వంటి కీలక సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ఈ కారు ధర రూ.6.13 లక్షలుగా ఉంది.


