FD Rates: వడ్డీ రేట్లను బాగా పెంచేసిన ఆ బ్యాంకు.. ఏడాదికి ఎంతోస్తుందో తెలుసా?

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటిగా కొనసాగుతున్న ‘బ్యాంక్ ఆఫ్ ఇండియా’ తాజాగా వడ్డీ రేట్లను బాగా పెంచేసింది. సంవత్సరం వరకు ఫిక్స్ డ్ డిపాజిట్ చేసుకున్నవారికి వడ్డీ రేటును 6 శాతం నుంచి 7 శాతం వరకు పెంచేసింది.

Written By: Srinivas, Updated On : May 29, 2023 4:05 pm

FD Rates

Follow us on

FD Rates: ఎంత సంపాదించినా కొందరు డబ్బును సేవింగ్ చేయడంలో పొరబడతూ ఉంటారు. వడ్డీలు ఎక్కువ వస్తుందన్న ఆశతో చాలా మంది ఇతరులకు అప్పు ఇవ్వడం లేదా.. చిట్స్ వేయాలని నిర్ణయించుకుంటారు. కానీ ఇందులో ఎక్కువగా మోసాలు జరుగుతుండడంతో చాలా మంది బ్యాంకుల్లో ఫిక్స్ డ్ డిపాజిట్లు చేస్తుంటారు. అయితే బ్యాంకుల్లో డబ్బు దాచుకోవడానికి కొందరు ఆసక్తి చూపరు. కానీ ఒక్కోసారి వడ్డీ రేట్లు పెంచడంతో బయటకంటే ఎక్కువ వడ్డీ లభిస్తుంది. ముఖ్యంగా ఫిక్స్ డ్ డిపాజిట్లపై ఊహించని విధంగా లాభం వస్తుంది. లేటేస్టుగా ఓ ప్రముఖ బ్యాంకు భారీ వడ్డీ రేటు పెంచేసింది. దీంతో ఫిక్స్ డ్ డిపాజిట్లు చేసుకున్నవారికి అధిక ప్రయోజనం కలగనుంది.

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటిగా కొనసాగుతున్న ‘బ్యాంక్ ఆఫ్ ఇండియా’ తాజాగా వడ్డీ రేట్లను బాగా పెంచేసింది. సంవత్సరం వరకు ఫిక్స్ డ్ డిపాజిట్ చేసుకున్నవారికి వడ్డీ రేటును 6 శాతం నుంచి 7 శాతం వరకు పెంచేసింది. రూ.2 కోట్ల లోపు ఫిక్స్ డ్ డిపాజిట్లు చేసుకున్నవారికే ఇది వర్తిస్తుంది. మొన్నటి వరకు వడ్డీ రేట్లు వరుసగా తగ్గడంతో డిపాజిట్ దారులు నిరాశ చెందారు. కానీ ఒక్కసారిగా ఒక శాతం వడ్డీ రేటు పెరగడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇవే కాకుండా సీనియర్ సిటీజన్ల పిక్స్ డ్ డిపాజిట్లకు ప్రత్యేకంగా వడ్డీ రేట్లను పెంచేసింది. ఇప్పటి వరకు బ్యాంకులు అధికంగా 7.5 శాతం వడ్డీ అందిస్తోంది. కానీ ఇప్పుడు సూపర్ సీనియర్ సిటిజన్స్ పేరిట 7.65 శాతం వరకు ఇవ్వనుంది. ఇవి సంవత్సరకాలం వరకు కాల పరిమితిని నిర్ణయించుకున్నవారికి వస్తుంది. ఈ వడ్డీ రేట్లు నిన్నటి వరకు కొన్ని బ్యాంకుల్లో మాత్రమే ఉండేవి ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫర్ చేస్తోంది.

సంవత్సర కాలానికే కాకుండా 7 రోజుల నుంచి 45 రోజుల ఎఫ్ డీలపై 3 శాతం, 46 నుంచి 179 రోజులకు 4.5 శాతం అందిస్తోంది. ఇక 270 రోజుల నుంచి ఏడాదిలోపు ఫిక్స్ డ్ డిపాజిట్ చేసుకునేవారికి 5.5 శాతం వర్తిస్తుంది. ఇదే సీనియర్ సిటీజన్ల కు చూస్తే 0.5 అదనపు వడ్డీ రేటు వర్తిస్తుంది. అయితే బ్యాంకుల్లో డిపాజిట్లు చేసేవారు ఇతర బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్ల రేట్లు కూడా తెలుసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.