Homeబిజినెస్Bank Customers: బ్యాంకు ఖాతాదారులకు కొత్త సౌలభ్యం..!

Bank Customers: బ్యాంకు ఖాతాదారులకు కొత్త సౌలభ్యం..!

Bank Customers: బ్యాంకు ఖాతాదారులకు సంతోషకరమైన వార్త! ఇకపై ఒక్కో ఖాతాకు నలుగురు వరకు నామినీలను నియమించుకునే అవకాశం కల్పిస్తూ బ్యాంకింగ్‌ చట్టాల సవరణ బిల్లు, 2024ను భారత పార్లమెంట్‌ ఆమోదించింది. ఈ బిల్లు గత డిసెంబర్‌ 3న లోక్‌సభలో, ఆ తర్వాత మార్చి 26, 2025న రాజ్యసభ(Rajya Sabha)లో ఆమోదం పొందింది. నగదు డిపాజిట్లు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు(Fixd dipagits) చేసేటప్పుడు నామినేషన్‌ వివరాలను తప్పనిసరిగా తెలపాలి. బ్యాంకు లాకర్ల విషయంలోనూ ఇదే నిబంధన వర్తిస్తుంది. ఇప్పటికే బీమా పాలసీలు, ఇతర ఆర్థిక సాధనాల్లో ఈ విధానం అమలులో ఉంది. ఈ సవరణ ద్వారా ఖాతాదారుడు మరణించినప్పుడు నిధులు వారసులకు సులభంగా బదిలీ అవుతాయి. నామినీలను ఒకేసారి (సైమల్టేనియస్‌) లేదా క్రమపద్ధతిలో (సక్సెసివ్‌) నియమించవచ్చు. ఉదాహరణకు, నలుగురికి సమానంగా లేదా నిర్దిష్ట శాతంలో నిధులు పంచవచ్చు, లేదా మొదటి నామినీ అందుబాటులో లేకపోతే తదుపరి వ్యక్తికి బదిలీ చేయవచ్చు.

సబ్‌స్టాన్షియల్‌ ఇంటరెస్ట్‌ పరిమితి పెంపు
బిల్లులో మరో కీలక మార్పు ఏమిటంటే, ’సబ్‌స్టాన్షియల్‌ ఇంటరెస్ట్‌’ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.2 కోట్లకు పెంచారు. గతంలో, బ్యాంకు వాటా మూలధనంలో 10% (గరిష్ఠంగా రూ.5 లక్షలు) వాటా కలిగిన వ్యక్తిని ఈ వర్గంలోకి చేర్చేవారు. 60 ఏళ్ల క్రితం నిర్ణయించిన ఈ పరిమితిని ప్రస్తుత ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా సవరించారు. ఇలాంటి వ్యక్తులకు రుణాల మంజూరులో అదనపు నిబంధనలు వర్తిస్తాయి.

ఎగవేతదార్లపై కఠిన చర్యలు
రాజ్యసభలో చర్చ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మాట్లాడుతూ, బ్యాంకుల నిరర్థక ఆస్తులు (NPAలు) తగ్గినప్పటికీ, ఉద్దేశపూర్వక ఎగవేతదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గత ఐదేళ్లలో 912 బ్యాంకు మోసాల కేసులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఉఈ) చేపట్టినట్లు తెలిపారు. ’రైట్‌–ఆఫ్‌’ అంటే రుణాల మాఫీ కాదని, వసూలు ప్రక్రియ కొనసాగుతుందని ఆమె వివరించారు.

యూపీఐలో అంతరాయం
ఇదిలా ఉండగా, మార్చి 26న యూపీఐ సేవల్లో గంటసేపు అంతరాయం ఏర్పడి, గూగుల్‌ పే(google pay), ఫోన్‌పే(Phone pay వినియోగదారులు ఇబ్బంది పడ్డారు. సాంకేతిక లోపాల వల్ల ఈ సమస్య తలెత్తినప్పటికీ, ఇప్పుడు సేవలు సాధారణ స్థితికి వచ్చాయని ఎన్‌పీసీఐ తెలిపింది.

మార్చి 31న బ్యాంకులు పని
ఆర్థిక సంవత్సరం (2024–25) ముగింపు సందర్భంగా, మార్చి 31 (సోమవారం)న రంజాన్‌ సెలవు ఉన్నప్పటికీ, అన్ని బ్యాంకులు పనిచేయాలని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఖఆఐ) ఆదేశించింది. ప్రభుత్వ లావాదేవీలు, ఆదాయ లెక్కలను నమోదు చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆన్‌లైన్, మొబైల్‌ బ్యాంకింగ్‌ సేవలు అందుబాటులో ఉంటాయి. అయితే, ఏప్రిల్‌ 1న వార్షిక ఖాతాల ముగింపు కారణంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
RELATED ARTICLES

Most Popular