ATR: టర్బోప్రాప్ విమానాల తయారీ సంస్థ ఏటీఆర్ భారత దేశంలో ప్రాంతీయ విమాన ప్రయాణానికి పెరుగుతున్న డిమాండ్‌తో భారతదేశం అతిపెద్ద మార్కెట్‌గా అవతరించనుందని ఆసియా పసిఫిక్ వాణిజ్య విభాగం అధిపతి జీన్–పియర్ క్లెర్సిన్ బిజినెస్ స్టాండర్డ్‌తో చెప్పారు. ఏటీఆర్ ప్రస్తుతం దేశంలో 67 విమానాలు నడుపుతోంది. ఇందలో ఇండిగో 45, అలయన్స్ ఎయిర్ 20, ఫ్లై91 సంస్థ రెండు విమానాలు నడుపుతున్నాయి. ఈ విమానాలు 70 నుంచి 80 సీటింగ్ కెపాసిటీ కలిగి ఉంటాయి. 1,500 కి.మీ పరిధిలో తిరుగుతాయి. ప్రాంతీయ ప్రయాణాలకు ఇవి చాలా అనుకూలమైనవి. చిన్న నగరాలు, పట్టణాలను కలుపుతుంది.
ప్రపంచ వ్యాప్తంగా 1,400 విమనాలు..
ఇక ఎయిర్‌బస్, లియోనార్డో మధ్య జాయింట్ వెంచర్ అయిన ఏటీఆర్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 1,400 విమానాలు కలిగి ఉంది. ‘ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏటీఆర్ విమానాల సముదాయాన్ని భారతదేశం కలిగి ఉంది. భారతదేశంలో ఏటీఆర్ విమానాల సగటు వయస్సు అత్యల్పంగా ఉంది. మనకు భారతదేశం యొక్క ప్రాముఖ్యతను మరియు విమానయానాన్ని పెద్దగా చూడకపోతే కొంత అంధత్వం ఉంటుంది’అని క్లెర్సిన్ పేర్కొన్నాడు. ‘ఒక దేశంలో ఏటీఆర్ విమానాల సంఖ్య పరంగా, భారతదేశం మొదటి మూడు స్థానాల్లో ఉంది. ప్రస్తుతం 100 ఏటీఆర్ విమానాలతో ఇండోనేషియా నంబర్ వన్ స్థానంలో ఉంది. బ్రెజిల్ 70 విమానలతో రెండో స్థానంలో ఉండగా, భారత్ 67 విమానాలతో మూడో స్థానంలో ఉంది. రాబోయే పదేళ్లలో భారత్ అతిపెద్ద విమాన మార్కెట్ కాబోతోంది అని వెల్లడించాడు.
పదేళ్లలో 50 నుంచి 150 విమానాలు..
ఇక భారత్ రాబోయే పదేళ్లలో భారీగా టర్బోప్రాస్ విమానాలు కొనుగోలు చేస్తుందని తెలిపాడు. తమ అంచనా ప్రకారం రాబోయే పదేళ్లలో కొత్తగా 50 నుంచి 150 వరకు టర్బోప్రాప్ విమానాలు కొనుగోలు చేయవచ్చని పేర్కొన్నారు. ఏటీఆర్ భారతదేశ ప్రాంతీయ విమానయాన మార్కెట్లో అపారమైన సామర్థ్యాన్ని చూస్తుందన్నారు. ‘ప్రజలు మరింత సౌలభ్యం మరియు వేగవంతమైన మార్గాన్ని కోరుకుంటున్నారు. ఇతర రవాణా అవస్థాపన (రోడ్లు, రైలు, మొదలైనవి) పెరుగుతోంది కానీ డిమాండ్ యొక్క వేగాన్ని అందుకోవడం లేదు. అందువల్ల ప్రాంతీయ విమానయానానికి పెద్దపీట వేయాలి’ అని అన్నారు.
ఇప్పటికే ఆర్డర్లు..
ఇదిలా ఉంటే ఇండిగో 2017లో 50 ఏటీఆర్ విమానాలను ఆర్డర్ చేసింది, వాటిలో 45 ఇప్పటికే డెలివరీ చేయబడ్డాయి. మిగిలిన ఐదింటిని ఈ ఏడాది డిసెంబర్ నాటికి డెలివరీ చేయాలని కంపెనీ యోచిస్తోంది. భారత్‌లో కనెక్టివిటీని పెంచడం చాలా అవసరం అన్నారు. ద్వితీయశ్రేణి నగరాలతో కనెక్టివిటీకి తమ విమానాలు చాలా ఉపయోగపడతాయి అని తెలిపాడు.
ఏడాదికి 5 నుంచి 15 విమానాలు..
ఇక ఏటీఆర్ వచ్చే దశాబ్దాంలో భారత్‌కు ఏటా 5 నుంచి 15 విమానాలు సరఫరా చస్తుందని క్లెర్సిన్ తెలిపాడు. 2023లో ఏటీఆర్ ప్రపంచ వ్యాప్తంగా 36 విమానాలు సరఫరా చేసిందని తెలిపారు. ఇక ఇండిగో, ఎయిర్ ఇండియా ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఎయిర్ క్రాఫ్ట్ ఆర్డర్లను ఇచ్చినట్లు పేర్కొన్నాడు. 2023 జూన్‌లో ఇండిగో 500 అ320 n్ఛౌ కుటుంబ విమానాల కోసం యురోపియన్ విమానాల తయారీ సంస్థ ఎయిర్‌బస్‌తో ఆర్డర్ చేసింది. 2023, ఫిబ్రవరిలో ఎయిర్ ఇండియా గ్రూప్ 470 విమానాల కోసం ఆర్డర్ చేసింది.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Atr sees india as its biggest market in 10 years as air travel demand grows
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com